Hydra News (imagecredit:swetcha)
హైదరాబాద్

Hydra News: అల్వాల్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు!

Hydra News: అల్వాల్ చినరాయుని చెరువులో ఎఫ్ టిఎల్ పరిధిలోని అక్రమ భవన నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపించింది. గత కొన్నాళ్లుగా చెరువుకు ఆనుకుని ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న స్థలంలో అక్రమంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్రమ భవన నిర్మాణాల విషయంలో స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో తెల్లవారుజామునే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని కూల్చివేతలు చేపట్టారు. జెసిబిల సహాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు. ఈ తరుణంలో భవన నిర్మాణదారులు హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మిస్తున్న మూడు నిర్మాణాలకు ఇటీవలే నోటీసు సైతం జారీ చేసిన అధికారులు కూల్చివేతలు చేశారు. కూల్చివేతల సమయంలో భవన యజమానులు అడ్డుపడేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలువరించారు.

Also Read: Punjab Youtuber Arrested: పాక్‌తో లింకులు.. మరో యూట్యూబర్ అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు:

నిజాం కాలంలోని చెరువు

హైదరాబాద్‌లో నిజాం కాలంలో 20 ఎకరాల కంటే ఎక్కవగా విస్తరించిన అల్వాల్‌ చెరువు ప్రస్తుతం తొమ్మిదెకరాలకు పరిమితమైపోయింది. ఇది మానవ నిర్మితమైన చెరువు. ఒకప్పుడు ఈచెరువులో పశువులు, పక్షులకు ఆవాసంగా ఉండేది. మరియు పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చే చెరువుగా కూడా ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ చెరువు తన అస్తిత్వాన్ని, ప్రభావాన్ని క్రమంగా కోల్పోతూ వస్తోంది. గృహ సంబంధ వ్యర్థాలు, కాలుష్యకారకాలు పెరిగి చెరువు మొత్తం మురికికూపంగా మారిపోయి ఆక్రమణలతో మొత్తం కూరుకుపోయింది.

Also Read: Chandrababu: ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా.. ఆ మంత్రులపై చంద్రబాబు తీవ్ర అసహనం!

 

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్