Punjab Youtuber Arrested: దేశంలో మరో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ అయ్యారు. పంజాబ్ కి చెందిన సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ జస్బీర్ సింగ్ (Jasbir Singh) ను తాజాగా నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత్ కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ కు చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ లోని రూప్ నగర్ లో అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు మెుహాలీలోని స్టేర్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (State Special Operations Cell) అదుపులో ఉన్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. అతడి అరెస్టుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
డీజీపీ ఏమన్నారంటే!
పంజాబ్ యూట్యూబర్ జస్బీర్ సింగ్ అరెస్టుపై ఆ రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్ (Punjab DGP Gaurav Yadav) మాట్లాడారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో జరిగిన పాక్ నేషనల్ డే వేడుకలకు జస్బీర్ సింగ్ హాజరైనట్లు తెలిపారు. అతడికి పాక్ హై కమిషన్ (Pak High Commission)లో పని చేసిన డానిష్ నుంచి ఆహ్వానం అందినట్లు పేర్కొన్నారు. అంతేకాదు అతడు 2020, 2021, 2024 సంవత్సరాల్లో మూడుసార్లు పాక్ లో పర్యటించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడికి సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైజెస్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా.. పాకిస్థాన్ కు చెందిన మెుబైల్స్ నెంబర్లు బయటపడ్డాయి. ఇటీవల అరెస్ట్ అయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyothi Malhothra) తరహాలో అతడికి కూడా పాక్ ఇంటిలిజెన్స్ ఆపరేటివ్స్ (Pakistani intelligence operatives)లో పని చేసే వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.
జ్యోతి మల్హోత్రాతో సంబంధం
జస్బీర్ సింగ్‌కు హరియాణాకు చెందిన మరో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలింది. ఇటీవల ఆమె అరెస్ట్ సందర్భంగా అతడితో దిగిన ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. జ్యోతి అరెస్ట్ అయిన వెంటనే జస్బీర్ సింగ్ తన ఫోన్ నుంచి వీడియోలు, కాంటాక్ట్‌లను తొలగించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. దీంతో పంజాబ్ యూట్యూబర్ పై ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత లోని దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే జల్బీర్ కు ‘జాన్ మహల్’ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దానిని 1.1 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Also Read: Tragedy in Agra: రీల్స్ నింపిన విషాదం.. ఒకే ఫ్యామిలీలో ఆరుగురు బలి.. ఏమైందంటే?
యూట్యూబర్ల వరుస అరెస్టులు
ఆపరేషన్ సింధూర్ అనంతరం గూఢచర్యం ఆరోపణలు తెరపైకి రావడంతో.. గత కొంతకాలం నుంచి పాకిస్తాన్‌లో పర్యటించిన యూట్యూబర్లపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే తొలుత హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను భారత నిఘా వర్గాలు అరెస్ట్ చేశారు. ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగిన యూట్యూబర్లపై కూడా ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం తెలుగు ట్రావెల్ యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నాయి. ఇటీవల అతడు చేసిన పాక్ పర్యటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నాయి. తాజాగా జల్బీర్ సింగ్ ను సైతం అదుపులోకి తీసుకోవడంతో త్వరలో మరింత మంది యూట్యూబర్లు లోపలికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.