Hydra: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వరుసగా సంభవించిన అగ్ని ప్రమాదాలను హైడ్రా సీరియస్ గా తీసుకుంది. ఇటీవల నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరగటంతో స్పందించిన హైడ్రా రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ, ఫైర్ తదితర సంబంధిత శాఖలతో సమావేశాన్ని నిర్వహించిన 24 గంటల్లోనే హైడ్రా (Hydra) క్షేత్ర స్థాయిలో యాక్షన్ మొదలు పెట్టింది. అగ్ని ప్రమాదాల నివారణ, ఫైర్ సేఫ్టీపై స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఇందుకు గాను తనిఖీలు మొదలు పెట్టింది. వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లో ఉన్న నీరూస్ షోరూమ్ ను గురువారం హైడ్రా అధికారులు తనిఖీ చేశారు.
హైడ్రా కమిషనర్ సీరియస్
మూడు సెల్లార్లు, నాలుగు అంతస్తులకు తోడు ఆపైన అనుమతి లేని రూఫ్ షెడ్డు వేసి వస్త్రాలతో నింపేయడాన్ని హైడ్రా కమిషనర్ సీరియస్గా పరిగణించారు. రెండు అంతస్తుల్లో అమ్మకాలు, పైన మూడు అంతస్తుల్లో వస్త్రాల తయారీ, గోదాములా పెద్ద మొత్తంలో నిలువలు ఉంచడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫైర్ ఎన్ ఓసీ లేకుండా షాపులను నిర్వహిస్తున్నట్టు నిర్ధారించారు. ఫైర్ నిబంధనలను పాటించకపోవడమే గాక, ఫైర్ ఎక్స్టింగ్విషర్ (మంటలను పరికరాలు) లు కూడా సరిగా లేకపోవడాన్ని గమనించారు. ఇలా ప్రతి విషయంలోనూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో సీజ్ చేయాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. హైడ్రా, ఫైర్, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఫైర్ అన్ సేఫ్ షాపుగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేయడమే గాక, హైడ్రా ఫెన్సింగ్ వేసింది. విద్యుత్ అధికారులు పవర్ సప్లైను నిలిపివేశారు.
Also Read: Hydra: 6.12 ఎకరాల భూమి కబ్జా.. 3 ఎకరాల మామిడితోట ఎవరిదంటే? హైడ్రా కీలక ప్రకటన!
నాంపల్లిలోని ఫర్నీచర్ షోరూమ్ మూసివేత
నాంపల్లి స్టేషన్ రోడ్డులో గత శనివారం బచ్చాస్ ఫర్నీచర్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించడం, ఐదుగురు మృతి చెందిన ఘటన తర్వాత ఘటన స్థలానికి కూత వేటు దూరంలో ఉన్న దుకాణుదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సీరియస్ గా తీసుకున్నారు. నాంపల్లి స్టేషన్ రోడ్డులో రహీమ్, మన్నన్ ఎస్టేట్స్ స్టాండర్డ్ ఫర్నీచర్ దుకాణం ఉన్న భవనం 6 అంతస్తులుండగా, సెల్లార్తో పాటు మొత్తం అన్ని అంతస్తుల్లో భారీగా ఫర్నీచర్ నిల్వ ఉంచటం, మెట్ల మార్గాన్ని కూడా మూసేసిన విధంగా స్టాక్ పెట్టడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ ఎన్ఓసీ లేకపోవడంతో పాటు 6 అంతస్తుల్లో ఎక్కడా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కనిపించకపోవడాన్ని సీరియస్గా పరిగణించారు. మొత్తం 6 అంతస్తులు తనిఖీ చేసిన కమిషనర్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎక్కడా పాటించలేదన్న విషయాన్ని నిర్థారించిన తర్వాత సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు హైడ్రా, జీహెచ్ఎంసీ, ఫైర్ విభాగంతో పాటు విద్యుత్ శాఖకు చెందిన అధికారులు చర్యలు తీసుకున్నారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఆ భవనంలో వ్యాపార లావాదేవీలు జరగకుండా చెక్ పెట్టారు. .
ఉల్లంఘటనలపై 7207923085 నెంబర్ కు ఫిర్యాదు చేయొచ్చు
ఫైర్ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఎవరైనా గమనిస్తే హైడ్రా కంట్రోల్ రూమ్ 9000113667 నెంబర్ తో పాటు నేరుగా తన నెంబరు 7207923085 కు సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగర ప్రజలను కోరారు. షాపులను గోదాములగా మార్చేసి వారి వ్యాపార వస్తువులను అందులోనే నిల్వ ఉంచడం, సెల్లార్లలో భారీ మొత్తంలో అగ్ని ప్రమాదానికి కారణమైన వస్తువులు పెట్టినట్లయితే సంబంధిత షాపు, వ్యాపార సముదాయాల వివరాలతో పాటు, ఆ వ్యాపార సంస్థ ఉన్న ప్రాంతం స్పష్టంగా పేర్కంటూ వాట్సాప్ ద్వారా, ఫొటోలు, వీడియోలు పంపాలని సూచించారు. కమిషనర్_ హైడ్రా పేరిట పేరిట ఉన్న ఎక్స్(ట్విట్టర్) వేదికగా కూడా ఫిర్యాదు చేయవచ్చునని హైడ్రా కమిషనర్ రంగనాధ్ నగరవాసులను కోరారు.
Also Read: HYDRAA: హైడ్రా ఆపరేషన్ సక్సెస్.. మియాపూర్లో సర్వే నెంబర్ 44లో కబ్జా బాగోతం..!

