HYDRA (image CrediT: swetcha Reporter)
హైదరాబాద్

HYDRA: నేటితో హైడ్రా ఏర్పాటై ఏడాది.. స్వేచ్ఛ ప్రత్యేక కథనం

HYDRA: హైదరాబాద్ మహా నగరంలో నాలాలు, చెరువులు, కుంటలు, చివరికి గుడి, బడి స్థలాలను సైతం యథేచ్ఛగా కబ్జా చేసి పడేశారు. ఇదంతా అందరికీ తెలుసు. కానీ, పట్టించుకునే వారు ఎవరు. ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తే, కబ్జాదారుల నుంచి బెదిరింపులు. కానీ, ఇదంతా గతం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని (HYDRA) ఏర్పాటు చేసింది. లక్ష్యం పెద్దే. సాధ్యమయ్యే పనేనా అనే విమర్శలు ఎదురయ్యాయి. అయినా, హైడ్రా అధికారులు మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగి ప్రభుత్వ స్థలాలు, ప్రజల రక్షణే లక్ష్యంగా ఏడాది పూర్తి చేస్తున్నది. ఈ ఏడాది కాలంలో ఏం చేసిందో తెలుసుకుందాం.

హైదరాబాద్ బ్యూరో, స్వేచ్ఛ: సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాలను కాపాడేందుకు ఏర్పడిన హైడ్రా ఆక్రమణలకు, కబ్జాలకు పాల్పడింది ఎంతటి వారైనా, ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలు సరైనవేనన్న విషయం రుజువైతే చాలు ఫీల్ట్ లెవెల్‌లో బుల్డోజర్లతో యాక్షన్‌లోకి దిగుతున్నది. అక్రమార్కులు, కబ్జా దారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కారు ఏర్పడింది. 2024 జూలై 19న పురుడు పోసుకున్న హైడ్రా ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విజయాలను, సంచలనాలను సొంతం చేసుకుని ఎన్నో చోట్ల కాలనీ, బస్తీ వాసులతో పాటు దేవాలయాల భూములను సైతం కాపాడి మన్ననలు పొందింది.

 Also Read: Viral News: గూగుల్, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి..లివ్-ఇన్ పార్టనర్‌పై..

సీఎం ఫుల్ సపోర్ట్

హైడ్రా ఏర్పాటుకు సంబంధించి సర్కారు జీవోను జారీ చేయడంతో పాటు సమర్థవంతంగా వ్యవహరించేలా మరికొన్ని పవర్స్ కూడా కట్టబెట్టి స్ట్రాంగ్ చేసింది. దీనికి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా భాధ్యతలు అప్పగించింది. హైడ్రా కమిషనర్‌తోపాటు ఇదివరకు లేక్ ప్రొటెక్షన్ చెర్మైన్‌గా హెచ్ఎండీఏ (HMDA) కమిషనర్‌కు భాధ్యతలు ఉండగా, ఇప్పుడు ఆ భాధ్యతలను కూడా హైడ్రా కమిషనర్‌కు ప్రభుత్వం అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  దనికి ఫుల్ సపోర్టు ఇస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం హైడ్రాకు రూ.60 కోట్లు మంజూరు చేసింది. ఆక్రమణలు, కబ్జాలపై కొరడా ఝళిపిస్తూ ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న హైడ్రా, ఇటీవలే నగరంలోని వానాకాలం సహాయక చర్యల బాధ్యతలతో పాటు నాలాల పూడికతీత పనుల బాధ్యతలను సైతం భుజాన వేసుకున్నది.

తక్కువ కాలంలోనే గ్రేట్ వర్క్

ఏర్పాటైన అనతి కాలంలోనే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లను ఆక్రమించాలంటేనే కబ్జాదారులు, వారికి అండగా నిలిచే రాజకీయ నేతల వెన్నులో వణికు పుట్టే పరిస్థితిని హైడ్రా తీసుకువచ్చింది. ఇచ్చిన ఫిర్యాదులను గుడ్డిగా నమ్మకుండా, టెక్నికల్ ఆధారాలన్నీ సేకరించి చేపట్టిన చర్యలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లోనూ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వచ్చిందనడంలో సందేహం లేదు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనే కాకుండా పార్కులు, నాలాలు, రోడ్లు, ఫుట్ పాత్‌లు తదితర ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కూడా హైడ్రా చర్యలు తీసుకుంటున్నది. బాధ్యులపై కేసులు నమోదు చేసేందుకు వారికి న్యాయస్థానాల్లో త్వరితగతిన శిక్షలు అమలు చేసేందుకు ఇటీవల ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసుకున్నది.

ఫస్ట్ యాక్షన్.. బెస్ట్ రిజల్ట్

హైడ్రా (HYDRA) ఏర్పాటైన కొత్తలో లోటస్ పాండ్‌లో ఫిల్మ్ నగర్‌లో కో ఆపరేటివ్ సొసైటీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి కట్టిన కాంపౌండ్ వాల్‌ను కూల్చి సంచలనాన్ని సృష్టించింది. నేటికీ అదే వ్యూహం, అదే ఊపుతో ముందుకెళ్తున్న హైడ్రా, (HYDRA) ప్రజావాణి కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తూ ప్రజల నుంచి కూడా ఫిర్యాదులను స్వీకరిస్తుంది. దీంతో కబ్జాలపై ఫిర్యాదులు చేసేందుకు పౌరులు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు ఇలా ఎవరి ఆక్రమణలు వదలకుండా బుల్డోజర్లను నిలిపి, సామాన్యుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది హైడ్రా. ఇలా ఏడాది కాలంలో 570 చోట్ల ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించి 480 ఎక‌రాల ప్రభుత్వ భూమిని కాపాడి, సుమారు రూ.25 వేల కోట్ల ఆస్తుల‌ను కబ్జా కోరల నుంచి విముక్తి కలిగించింది.

దాదాపు 350 చోట్ల చెరువుల ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించి 133 ఎకరాలను కాపాడడంతో పాటు చెరువులకు జీవం పోసింది. లే ఔట్‌లు, తదితర కాలనీల్లో ప్రజా అవసరాలకు సంబంధించి 85 చోట్ల ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించి 121 ఎకరాలను కాపాడి, ఆ స్థలాలకు నిజమైన అర్హులకు అప్పగించేలా చేసింది. 20 చోట్ల నాలాలు ఆక్రమణలకు గురి కాగా, వాటిని తొలగించి 8 ఎకరాలకు పైగా ర‌క్షించింది. అలాగే, 74 చోట్ల రహదారులపై ఉన్న ఆక్రమణలను తొల‌గించి 218.30 ఎకరాల మేర రహదారి ఆక్రమణలను కాపాడి, అనేక చోట్ల రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన అడ్డంకులను తొలగించి లైన్ క్లియర్ చేసింది. పార్కులకు సంబంధించి 38 చోట్ల ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించి 10.65 ఎకరాల స్థలాల‌ను కాపాడి, తిరిగి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. 5.94 ఎకరాలలో ఉన్న అనధికార నిర్మాణాలను తొల‌గించింది.

బతుకమ్మ కుంటకు పునర్జన్మ

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చారిత్రాత్మకమైన అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంటకు హైడ్రా పునర్జన్మను ప్రసాదించింది. ఈ తరం వారికి కేవలం పేరుకే పరిమితమైన (Bathukamma Kunta) బతుకమ్మ కుంటకు బతుకు ప్రసాదించి, తిరిగి పూర్వ వైభవం కల్పించడంలో సఫలీకృతమైంది. పూర్తిగా చెరువు నామ రూపాలు లేకుండా పోయిన బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం తీసుకొచ్చింది. పూర్తిగా చెట్లు, చెత్త, పిచ్చి మొక్కలతో పేరుకుపోయిన కుంటను సుందరీకరణ చేస్తున్నది. 1962 – 63 లెక్కల ప్రకారం ఇక్కడ 14 ఎకరాల 6 గుంటలుండగా, బఫర్ జోన్‌తో కలిపి 16 ఎకరాల 13 గుంటలు ఉండేవి. క్రమంగా ఆక్రమణలకు గురికాగా హైడ్రా నిర్వహించిన సర్వే ప్రకారం 5 ఎకరాల 15 గుంటలు ఉన్నట్లు తేలింది.

ఆ మిగిలి ఉన్న భూమిలో సుంద​రీకరణ పనులను ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టింది. ఈ భూములు తమవని కొందరు కోర్టులో కేసులు వేయగా, ఆ కేసులను ఎదుర్కొని ఎంతో చాకచక్యంగా చివరకు అభివృద్ధి పనులు మొదలుపెట్టింది. 5 ఎకరాల 12 గుంటల్లో ఉన్న కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నది. రూ.7 కోట్లతో బతుకమ్మ కుంటను హైడ్రా డెవలప్ చేస్తున్నది. కుంట చుట్టూ రాళ్ళతో గట్టును ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నది దాదాపు 70 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి పనులు పూర్తి కానున్నాయి. హైడ్రా (HYDRA) పైలెట్ కింద మొదటి దశలో ఆరు చెరువులను అభివృద్ధి చేయాలని ఎంపిక చేయగా, అందులో మొదటగా (Bathukamma Kunta) బతుకమ్మ కుంటను డెవలప్ చేసి సిటీలో తన మార్కును భద్రపర్చుకునేందుకు చూస్తున్నది.

హైడ్రా ఏర్పాటు చారిత్రక నిర్ణయం

గత పదేళ్లతో పోలిస్తే గడిచిన ఏడాదిలో చెరువుల పరిరక్షణ జరుగుతుందన్నది నగరంలో జరగుతున్న చర్చ. తెలంగాణ రాకముందు చెరువుల పరిస్థితి, తెలంగాణ వచ్చిన పదేళ్ల తరువాత చెరువుల పరిస్థితి చూస్తే దాదాపు అన్ని ఆక్రమణకు గురి కాగా, దానిపై కనీసం ఫిర్యాదు చేసే వారే లేకుండా పోయారు. ఒక వేళ ఫిర్యాదులు చేసినా, పట్టించుకునే అధికారులు, బాధ్యతగా ఫీలయ్యే విభాగమే లేకుండా పోయింది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కేసీఆర్ నగరంలో ఏ ఒక్క చెరువు కూడా ఆక్రమణకు గురికాకుండా చూస్తామని చెప్పారు. కానీ ఆచరణలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి.సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్​ కన్వెక్షన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో కూల్చివేస్తామని హడావుడి చేసినా చేసింది లేదు.

ఆ తరువాత చెరువుల పరిరక్షణ గాలికొదిలేశారు. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లోని నీటిని కొబ్బరి నీళ్లు చేస్తామని హామీ ఇచ్చి మరిచారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్లక్ష్యం చేయలేదు. హైడ్రాను తీసుకొచ్చి చెరువులను కాపాడుతున్నది. చెరువులతో పాటు ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ హైడ్రాను ఏర్పాటు చేయడం ఓ చారిత్రక నిర్ణయంగా చరిత్ర పుటల్లో నిల్చిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాలుగా కబ్జాల పాలైన చెరువులు, కుంటలకు విముక్తి కలిగించే ప్రక్రియను హైడ్రా రానున్న రోజుల్లో మరింత స్పీడ్ పెంచుతుందని అధికారులు చెబుతున్నారు.

Also Read: Seed Cotton Companies: సీడ్ కంపెనీల కుట్రలను చిత్తు చేసిన రైతులు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?