Seed Cotton Companies: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నపై కంపెనీలు రెండు క్వింటాళ్లు మాత్రమే కొంటామని మెలిక పెట్టడంతో రైతులు (Farmers) ఆందోళన బాట పట్టారు. గత 30 సంవత్సరాలుగా వాణిజ్య పంట అయిన సీడ్ పత్తి సాగుకు నడిగడ్డ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో (Seed Company) సీడ్ కంపెనీలు మధ్యవర్తులుగా ఆర్గనైజర్ లను నియమించుకొని (Farmers) రైతులకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి కాటన్ సీడ్ పంటలను సాగు చేయిస్తున్నాయి. నడిగడ్డలో సాగుపై వివిధ కారణాలతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో (Seed Company) సీడ్ కంపెనీలు కర్ణాటకలోని గజేంద్ర ఘడ్ లో సాగు విస్తీర్ణాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతున్నాయి. దీనికి ప్రధాన కారణం అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతోపాటు సాగు ఖర్చులు తక్కువగా ఉండడమే.
పంట సాగుతో అధిక లాభాలు
వాణిజ్య పంట అయిన సీడ్ పత్తి (Seed cotton) పంట సాగులో భాగంగా స్వల్పకాలిక పంట కావడం, ఇతర పంటలతో పోలిస్తే అధిక లాభాలు వస్తాయని ఈ పంట సాగుపై రైతులు (Farmers) ఆసక్తి చూపుతున్నారు. .ప్రతి సంవత్సరం జూన్ నెలలో విత్తనాలు విత్తగా 40 రోజుల తర్వాత క్రాసింగ్ ప్రక్రియ చేయబడతారు. ఫలితంగా గింజలు దూదితో కూడిన కాయ ఏర్పడుతుంది. అక్టోబర్ నెలలో పంట చేతికి వస్తుంది. డిలీటింగ్ ప్రక్రియ ద్వారా దూదిని వేరు చేసి గింజలను వేర్పరుస్తారు. వాటిని జి ఓ టి పరీక్షలు నిర్వహించి 98 శాతం వచ్చిన వాటిని పాసైన విత్తనాలుగా పరిగణిస్తారు. వాటికి సంబంధించిన నగదును ఏప్రిల్ ,మే నెలలో చెల్లిస్తాయి. కానీ ఇప్పటికీ కేవలం కావేరి, రాశి,బయో మైకో ,ధాన్య కంపెనీలు మాత్రమే పూర్తి మొత్తంలో (Farmers) రైతులకు చెల్లింపులు చేశాయి. అధిక విస్తీర్ణంలో సాగు చేసే భవ్య లాంటి అనేక కంపెనీలు రైతులకు 50 శాతం మేర ఏప్రిల్, మే నెలలో చెల్లింపులు చేయాల్సి ఉన్నా నేటికీ చెల్లింపులు చేయలేదు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
50 వేల ఎకరాలలో సీడ్ పత్తి పంట సాగు
జోగులాంబ గద్వాల జిల్లాలో (Jogulamba Gadwal District) గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో కన్వెన్షన్, జి ఎం ఎస్ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. దాదాపు 36 కంపెనీలు ఫౌండేషన్ సీడ్ ను (Farmers) రైతులకు ఇస్తున్నాయి. కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం సందర్భంగా సీడ్ సాగు విస్తీర్ణంపై ఆరా తీయగా 40 వేల ఎకరాలలో పంట సాగు చేస్తున్నారని జాబితా ఇచ్చారు. సమావేశానికి రాని మరో 10 కంపెనీలు మరో 12 వేల ఎకరాల వరకు సాగుకు విత్తనాలు ఇచ్చాయని సమాచారం. కన్వెన్షన్ పంట సాగు విధానంలో మూడున్నర క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుండగా జి ఎం ఎస్ సాగు విధానంలో ఎకరాకు 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
జి ఎం ఎస్ పంట కొనుగోలుపై కంపెనీలు మెలికలు, ధర్నాలు చేసిన రైతులు
జి ఎం ఎస్ పంట కొనుగోలుపై కంపెనీలు కేవలం రెండు క్వింటాలు మాత్రమే కొంటామని మెలిక పెట్టడంతో రైతులు భగ్గుమన్నారు. ఇప్పటికే ఆర్గనైజర్ల ద్వారా కొందరు రైతుల పంటను తొలగింప చేశారు. కంపెనీలు కొనుగోలుకు వెనుకంజకు ప్రధాన కారణం నిల్వలు అధికంగా ఉండి స్టాకు మార్కెట్లో ఆశించిన స్థాయిలో ప్రోకపోవడమే. మరోవైపు హైబ్రిడ్ బిజి 3 రకం గుజరాత్, మధ్యప్రదేశ్ లో సాగుతో సమస్య మొదలైంది.
ఈ రకం అధిక దిగుబడులు రావడమే కాక తెగుళ్లు, కలుపులు, పంట సస్యరక్షణ తక్కువగా ఉంటుంది. జి ఎం ఎస్ పంట దిగుబడి ఆరు క్వింటాల వరకు వస్తుందని కంపెనీలు కేవలం రెండు క్వింటాలు కొంటే మిగతా నాలుగు క్వింటాలు ఎవరు కొంటారని వాటిని ఏం చేసుకోవాలని, ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి పంట పండిస్తే ఆర్గనైజర్లు, కంపెనీలు మమ్మల్ని మోసం చేస్తున్నాయని రైతులు ఐజ సమీపంలో ప్రధాన రహదారిపై, కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులు (Farmers) పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
కలెక్టర్ చొరవతో సీడ్ కొనుగోలుకు అంగీకారం
పండించిన ప్రతి గింజను కొనాలని రైతులు ధర్నా చేయడంతో కంపెనీలు, ఆర్గనైజర్లతో సమావేశం ఏర్పాటు చేస్తానని కలెక్టర్ హామీతో ధర్నాను విరమించారు.ఈ మేరకు కలెక్టర్ సంతోష్, (Collector Santosh) జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు,అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లతో సమావేశమై (Farmers) రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన మాట ప్రకారం కొనుగోలు చేయాలని అందుకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని తెలపడంతో అందుకు సమ్మతించి అంగీకార పత్రం రాసిచ్చాయి.
ఈ నేపథ్యంలో కలెక్టరేట్ కు వచ్చిన రైతులు, పలు ప్రజా, రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో రైతుల పండించిన ప్రతి గింజను కంపెనీలు కొంటాయని హామీనిస్తూ అంగీకార పత్రాలు రాసిచ్చారని, వాటిపై సంబంధిత కంపెనీ ఎం.డి సంతకంతో పాటు కంపెనీ సీల్ తీసుకుంటామన్నారు. దీంతో రైతులు కలెక్టర్ చొరవపై సంతోషం వ్యక్తం చేశారు.రైతుల సమస్యలపై స్వేచ్ఛ ప్రతినిధులు ఎప్పటికప్పుడు వరుస కథనాలు రాస్తూ సీడ్ సాగు రైతుల (Farmers) సమస్యలను వెలుగులోకి తెచ్చింది.
Also Read:Khammam District Farmers: వినూత్న రీతిలో మామిడి పిక్కల నుండి మొక్క తయారీ.. ఎక్కడంటే!