Hydraa: మల్కం చెరువు పరిసరాల్లో వరద పోటెత్తడానికి గల కారణాలను హైడ్రా(Hydraa) కమిషనర్ రంగనాధ్(Commissioner Ranganath) అన్వేషిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సమీక్షించారు. వరద ముంచెత్తడానికి, ట్రాఫిక్(Traffic)కు తీవ్ర అంతరాయం ఏర్పడడానికి కారణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. చెరువుకు వచ్చిన వరద నీటి ఇన్ ఫ్లో(Inflow) కు తగిన విధంగా, వరద నీరు బయటకు ప్రవహించేందుకు అవసరమైన ఔట్ ఫ్లో(Out Flow) లేకపొవటం వల్లే సమస్య తలెత్తినట్లు అధికారులు కమిషనర్ కు వివరించారు. ప్రస్తుతం అలుగు పారడం ద్వారా మాత్రమే నీరు బయటకు వెళ్తోందని, స్లూయిజ్ గేట్లు కూడా ఏర్పాటు చేస్తే, వర్షాకాలంలో నీటిమట్టాన్ని తగ్గించడానికి వీలవుతుందని వివరించారు.
బయోడైవర్సిటీ పార్కు
వర్షాలు తగ్గుముఖం పట్టినప్పుడు వెంటనే ఈ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను హైడ్రా(Hydraa) కమిషనర్ ఆదేశించారు. చెరువు పరిసరాల్లో రహదారులే కాకుండా, నివాసాలు కూడా నీట మునుగుతున్నాయన్న విషయాన్ని గుర్తించి వెంటనే ఈ పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. చెరువులోకి వచ్చిన ఇన్ ఫ్లో కు తగిన సామర్థ్యంతో ఔట్ ఫ్లో ను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. మల్కం చెరువు చుట్టూ వరద నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. బయోడైవర్సిటీ పార్కు(Biodiversity Park) పరిసరాలతో పాటు, షేక్ పేట ప్రాంతాల నుంచి కూడా భారీ వరద వచ్చి వంతెన ఆరంభంలో నిలిచిపోతోందని, ఈ వరదంతా మల్కం చెరువు(Malkam Cheruvu)లోకి చేరేలా ఏర్పాట్లు చేయాలన్నారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి(Avinash Mahanti9), ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తదితరులు హైడ్రా కమిషనర్ తో పాటు ఈ సందర్శనలో ఉన్నారు.
Also Read: Viral News: భారతీయులు విదేశాలకు వెళ్తే వెనక్కి రానిది అందుకేనా!
అర్ధరాత్రి వరకూ
గురువారం సాయంత్రం నుంచి దంచి కొట్టిన వర్షం అర్థరాత్రి వరకు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలి(Gachibowli) పరిసరాలు గురువారం రాత్రి నీట మునిగాయి. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వెళ్లే రహదారి షేక్ పేట వంతెన ఆరంభంలో నడుము లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఉస్మానియా కాలనీలోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాద్ హుటాహుటిన అక్కడకు చేరుకుని వరద నీటిని తొలగించే పనులను పర్యవేక్షించారు. తొలుత ఉస్మానియా కాలనీలో వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్ మల్కం చెరువు పరిసరాలను పరిశీలించారు. వరద తొలగించే పనులను పర్యవేక్షిస్తూనే, ట్రాఫిక్ క్లియరెన్స్ దృష్టి పెట్టారు.
ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చర్యలు
వరద ముప్పు లేని ప్రాంతాల నుంచి కూడా హైడ్రా డీఆర్ఎఫ్, ఎంఈటీ బృందాలు అక్కడికి చేరుకుని వాహన రాకపోకలు సులభం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల వరకూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరదతో పాటు ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చర్యలు చేపట్టారు. గురువారం వర్షానికి మొత్తం 78 ఫిర్యాదులను రాత్రికి రాత్రే హైడ్రా పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 41 ఫిర్యాదులు విరిగిపడిన చెట్లకు సంబంధించినవి కాగా, 36 చోట్ల వరద నీరు నిలిచిపోగా హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించారు. బంజారాహిల్స్ లోని ఎస్ బీఐ ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్, గ్రీన్ వ్యాలీ సమీపంలో వరదలో చిక్కుకున్న మహిళను కాపాడినట్లు హైడ్రా ఆఫీసర్లు వెల్లడించారు.
Also Read: Bhatti Vikramarka: బీజేపీ నేతలు డ్రామాలు బంద్ చేయాలన్న భట్టి