హైదరాబాద్: Hydra Commissioner ranganath: హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు ఎళ్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.ఎ సమయంలో ప్రమాదం ఎలా వస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి డీఆర్ ఎఫ్ బృందాల అప్రమత్తతతో కొంతమేర నష్టాన్ని తగ్గించగలమని ఆయన అన్నారు.
మంగళవారం నాడు హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు చేసుకోవడానికి ప్రయత్నించిన యువతిని కాపాడిన హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది అయిన మార్షల్ ఫకృద్దీన్, మరియు ,డీఆర్ ఎఫ్ సహాయక సిబ్బంది ఎ. రమేష్, ఎన్. శ్రీనివాస్, ఎండీ ఇమాముద్దీన్, కె. కార్తీక్ కుమార్‌లను కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ అభినందించారు.
హుస్సేన్ సాగర్‌లోకి దిగడానికి కూడా వీలులేని ప్రదేశంలో తాళ్ల సహయంతో యువతిని సురక్షితంగా కాపాడారన్నారు. గత వారంలో గురువారం రోజున భారీ వర్షం కురవగా ఒక్కసారిగా వచ్చిన వరదతో మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన డీఆర్ ఎఫ్ సిబ్బందిని కూడా కమిషనర్ రంగనాథ్ అభినందించారు.
Also Read: Bhogapuram Airport: ఈ విమానాశ్రయంతో మారనున్న దేశ రూపురేఖలు.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!