Bhogapuram Airport(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Bhogapuram Airport: ఈ విమానాశ్రయంతో మారనున్న దేశ రూపురేఖలు.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 71శాతం పూర్తయ్యాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు. మంగళవారం భోగాపురం విమానాశ్రయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు.

2026 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. దేశంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక్కటే అతి అధునాతనమైనదని తెలిపారు. ‘ ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారనున్నాయి. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నాం. ఉత్తరాంధ్ర సంప్రదాయాలు తెలిసేలా విమానాశ్రయంలో కళానిలయం ఏర్పాటు చేస్తున్నాం. ఎయిర్ పోర్టు పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి.

Also read: RBI Monetary Policy 2025: సామాన్యులకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు!

మట్టి పనులు 100శాతం, రన్‌వే పనులు 97 శాతం, టాక్సీ వే పనులు 92 శాతం, రూఫింగ్ పనులు 60 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. ఎన్డీఏ కూటమి కేవలం 9 నెలల్లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 23 శాతం నుంచి 71 వరకు పూర్తి చేశాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి రెండింటినీ పెంచుతుంది. సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో జూన్ 2026 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాం’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?