Hydraa (imagecredit:swetcha)
హైదరాబాద్

Hydraa: నివాస ప్రాంతాల‌కు పార్కులే ప్రాణం: హైడ్రా క‌మిష‌న‌ర్‌

Hydraa: లే ఔట్‌నే ప్రామాణికంగా తీసుకుని పార్కులు, ర‌హ‌దారులు, ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల‌ను ప‌రిర‌క్షిస్తామ‌ని హైడ్రా(Hydraa) కమిషనర్ రంగనాధ్(Ranganadh) క్లారిటీ ఇచ్చారు. ర‌హ‌దారుల‌ను ఎక్కడా బ్లాక్ చేయ‌వ‌ద్దని, పార్కుల ఆవ‌శ్యక‌త‌ను అర్థం చేసుకుని వాటిని కనుమరుగు చేయరాదని ఆయన కోరారు. ఎక్కడ ఆక్రమ‌ణ జ‌రిగినా, ఉల్లంఘ‌న‌లైనా నేరుగా హైడ్రా(Hydraa)కు ఫిర్యాదు చేస్తున్నారు. హైడ్రా(Hydraa) ప్రజావాణికి 58 ఫిర్యాదులందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అధిక‌ భాగం పార్కుల క‌బ్జాలు, ర‌హ‌దారుల ఆక్రమ‌ణ‌లు, ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల కాజేసే ప్రయత్నాల‌పై ఫిర్యాదులే అధికంగా ఉన్నట్లు వివరించారు. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ‌(Commissioner AV Ranganatha) ప‌రిశీలించారు. గూగుల్ మ్యాప్స్‌(Google Maps), లేఔట్లతో పాటు ఎన్ఆర్ఎస్‌సీ (NRSC), స‌ర్వే ఆఫ్ ఇండియా(Serve Off India), గ్రామ రికార్డుల‌ను ఫిర్యాదుదారుల ముందే ఆన్‌లైన్‌లో చూసి, ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌ను ఆదేశించారు. అక్కడిక‌క్కడే ఫిర్యాదుల‌ను క్షేత్రస్థాయిలో విచారించాల‌ని అసెట్ ప్రొటెక్షన్ అధికారుల‌కు అప్పగించారు. స‌మ‌స్య ప‌రిష్కారానికి గడువును కూడా ఫిర్యాదుదారుల ముందే నిర్ణయించారు.

ఫిర్యాదులిలా..
సికింద్రాబాద్‌లోని బోయిగూడ స‌మీపంలో సికింద్రాబాద్ మున్సిపాలిటీ(Secunderabad Municipality) ఉన్న స‌మ‌యంలో కురుమ శ్మశాన‌వాటిక కోసం ప్రత్యేకంగా 2 వేల గ‌జాల స్థలాన్ని కేటాయించ‌గా, నేడ‌ు అది నామ రూపాల్లేకుండా క‌బ్జాలకు గురైంద‌ని కురుమ సంఘం ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ అక్కడ నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని, షెడ్డులు వేసి ఆక్రమించారని, అక్కడ త‌మ పూర్వీకుల స‌మాధులున్నాయ‌ని రాంగోపాల్‌పేట డివిజ‌న్ కార్పొరేట‌ర్ చీర‌ సుచిత్ర(Corporator Sari Suchitra), తెలంగాణ క‌రుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీ‌కాంత్(Srikanth) త‌దిత‌రులు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారించి స్మశానాన్ని కాపాడాలంటూ కోరారు. మేడ్చల్ – మ‌ల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండ‌లం, బాచుప‌ల్లి గ్రామంలో శ్రీ సాయి కృష్ణ కాల‌నీలో 1700 గ‌జాల పార్కు స్థలాన్ని కాపాడాలంటూ హైడ్రా ప్రజావాణిలో అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు.

Also Read: Bhatti Vikramarka: కొల్లాపూర్‌లో నేను రాజకీయ ఓనమాలు దిద్దుకున్నాను

గ‌తంలో దీనిని పార్కుగా
4.8 ఎక‌రాల లే ఔట్‌లో ఈ స్థలాన్ని పార్కుకోసం కేటాయించార‌ని, నిజాంపేట మున్సిప‌ల్ అధికారులు ఫెన్సింగ్ వేస్తుండ‌గా, క‌బ్జాదారులు కోర్టుకు వెళ్లి ఆ ప‌నులు నిలిపేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. లే ఔట్ ప్రకారం పార్కును కాప‌డి, పిల్లలు ఆడుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. గ‌తంలో దీనిని పార్కుగా వినియోగించామ‌ని, బ‌తుక‌మ్మ ఉత్సవాలు కూడా ఇక్కడ నిర్వహించిన‌ట్టు ఫిర్యాదులో ఆధారాల‌తో స‌హా పేర్కొన్నారు. ఇటీవల కొంత మంది రియల్టర్లు కంచె తొలగించి, గేట్‌ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారుని ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లా గండిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని స‌ర్వే నంబ‌రు 69లో లే ఔట్(Lay Out) ప్రకారం 25 అడుగుల ర‌హ‌దారి ఉండ‌గా, దానిని ఆక్రమించేశార‌ని హైడ్రా(Hydraa)కు స్థానికులు ఫిర్యాదు చేశారు.

ఇప్పుడ‌ది క‌బ్జాల పాలౌతోంద‌ని
ఈ ర‌హ‌దారిపై హ‌క్కు త‌మ‌కే ఉంద‌ని, త‌మ‌ను బెదిరిస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా క‌రెంటు స్తంభాలు, తాగునీటి పైపులైన్లున్నా, రోడ్డు కాద‌ని వాదిస్తున్నార‌ని, దీంతో వంద‌లాది కుటుంబాల‌కు దారి లేకుండా అవుతోంద‌ని వాపోయారు. మేడ్చల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం భ‌గ‌త్ సింగ్ న‌గ‌ర్‌లో 3500 గ‌జాల స్థలాన్ని ప్రజావ‌స‌రాల‌కు కేటాయించ‌గా, ఇప్పుడ‌ది క‌బ్జాల పాలౌతోంద‌ని భ‌గ‌త్‌సింగ్ న‌గ‌ర్ ప్రభుత్వ ఆసుప‌త్రి స్థల ప‌రిర‌క్షణ క‌మిటీ హైడ్రా(Hydraa)కు ఫిర్యాదు చేసింది. దీనిని కాపాడేందుకు ప‌లుమార్లు జీహెచ్ఎంసీ(GHMC) నిధుల కేటాయించినా, ఈ స్థలాన్ని కాపాడితే అక్కడ ప్రభుత్వ ఆసుప‌త్రి నిర్మాణం జ‌రుగుతుంద‌ని క‌మిటీ ప్రతీనిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: Kaleshwaram project: బ్యారేజీలు ఎక్కడ నిర్మించాలో చెప్పింది కేసీఆర్?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్