Kaleshwaram project( image CREDIT: TWITTER)
Politics, లేటెస్ట్ న్యూస్

Kaleshwaram project: బ్యారేజీలు ఎక్కడ నిర్మించాలో చెప్పింది కేసీఆర్?

Kaleshwaram project: బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం టెన్షన్ స్టార్ట్ అయింది. క్యాబినెట్(Cabinet) సమావేశం  కొనసాగుతుండడంతో ఏం నిర్ణయం తీసుకొబోతున్నారు? అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు(Kaleshwaram Commission Report)ఏం ఇచ్చింది.. ఏం తేల్చబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు ఎక్కడ నిర్మించాలో చెప్పిందే కేసీఆర్(Kcr) అని కమిషన్ నివేదికలో పేర్కొంటున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కూలడానికి సైతం కేసీఆర్ కారణమని నివేదికలోనూ పేర్కొన్నారనే ప్రచారం జరుగుతున్నది.

అయితే, కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)ను ప్రతిష్టాత్మకంగా నిర్మించామని ప్రకటించింది. అయితే ఆ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో 87 పిల్లర్లు ఉండగా 2 పిల్లర్లు కూలిపోయాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government))అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై జస్టిస్ ఘోష్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ 15 నెలలుగా అధికారులను, రాజకీయ నేతలను విచారించింది.

Also Read:Kavitha vs Jagadeesh: కవిత వ్యాఖ్యలతో ఎర్రవెల్లికి వెళ్లిన మాజీ మంత్రి

రిపోర్టును గత నెల 31న ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికలోని అంశాలు క్యాబినెట్ ముందుకు నేడు(సోమవారం) రానున్నాయి. అయితే, కాళేశ్వరం ప్లానింగ్‌, ఎగ్జిక్యూషన్‌, కంప్లీషన్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌‌తో పాటు ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్‌(Kcr)దేనని నివేదికలో కమిషన్ పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతున్నది. నిర్లక్ష్యంగా అధికారులు, రాజకీయ నాయకులు బాధ్యతా రహితంగా పని చేశారని పేర్కొన్నట్లు సమాచారం.

మేడిగడ్డలోని ఏడో బ్లాకును నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ సంస్థ సొంత ఖర్చులతో పునర్నిర్మించాలని తేల్చి చెప్పిందని సమాచారం. ప్రాజెక్టు నిర్మాణంలో పాలన పరమైన, ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్‌ లేదని, డిజైన్‌లలోనూ లోపాలున్నాయని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేసీఆర్‌(Kcr) నుంచి ఇంజినీర్‌ వరకూ ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా తేల్చి చెప్పినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధివిధానాలను తుంగలో తొక్కారని, ఫలితంగా భారీగా ప్రజాధనంతోపాటు బ్యారేజీలూ కుంగుబాటుకు గురయ్యాయని పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌ రావు(Harish Rao) సొంతంగా తీసుకున్నారని, అది వారి వ్యక్తిగత నిర్ణయమని, దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి లాంఛనంగా ఎలాంటి నిర్ణయం లేదని స్పష్టం చేసినట్లు కమిషన్‌ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
మూడు బ్యారేజీల నిర్మాణానికి ప్రాథమికంగా పాలనపరమైన అనుమతులు తీసుకున్నారని, ఇందుకు జీవోలు జారీ చేశారని, కానీ, వాటిని క్యాబినెట్‌ ముందు ఉంచలేదని, మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసిందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు(Harish Rao) ఎటువంటి జవాబుదారీతనం లేకుండా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, పాలన ప్రక్రియను తుంగలో తొక్కారని, రాష్ట్రాన్ని ఆర్థికంగా సంరక్షించడంలో అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌(Etala Rajender) చిత్తశుద్ధి ప్రదర్శించలేదని నివేదికలో తప్పుబట్టిందని, ఆర్థిక జవాబుదారీతనం తన బాధ్యత కాదనుకున్నారని ఘోష్ పేర్కొన్నట్లు సమాచారం.

బ్యారేజీ నిర్మాణాల అంచనాల్లోనూ రెండుసార్లు సవరణలు చేశారని, ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. 38కోట్ల నుంచి 1.10లక్షలకోట్లకు పెంచారని ఇది నిర్మాణ సంస్థలకు లబ్డి చేకూర్చడానికేనని కమిషన్ నివేదికలో స్పష్టం చేసిందని సమాచారం. బ్యారేజీలను నీటిని మళ్లించడానికే కట్టాలని, నిల్వ చేయడానికి కాదని, కానీ, బ్యారేజీల్లో నిత్యం నీటిని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని, బ్యారేజీలు విఫలం కావడానికి ఇది ప్రధాన కారణమని నివేదిక తేల్చి చెప్పింది.

అయితే అన్నింటికి మూలమైన గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(Kcr)పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేబినెట్ భేటీలో ప్రధాన అంశం కాళేశ్వరంపై ఇచ్చిన నివేదిక. కేసీఆర్(KCR) తో పాటు ఎవరెవరిని బాధ్యులను చేస్తారు? ఏం నిర్ణయం తీసుకుంటారు? ఎప్పటిలోగా చర్యలకు ఉపక్రమిస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కాంట్రాక్టు ఎల్అండ్ టీ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది. గులాబీ నేతల్లో సైతం ఇప్పుడు విస్తృత చర్చజరుగుతుంది. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటే పార్టీలో ఏం జరుగుతుంది? ఉద్యమకార్యచరణ ఏమైనా చేపడతారా? ఏంజరుగబోతుందనేది కేడర్ లో జోరుగా ప్రచారం ఊపందుకుంది.

Also Read: Nagavamsi: ‘కుబేర’ పరువు తీసేసిన నాగవంశీ.. అసలు గుట్టు చెప్పేశాడుగా!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు