Nagavamsi on Kubera
ఎంటర్‌టైన్మెంట్

Nagavamsi: ‘కుబేర’ పరువు తీసేసిన నాగవంశీ.. అసలు గుట్టు చెప్పేశాడుగా!

Nagavamsi: ఇటీవల థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘కుబేర’ (Kubera) సినిమాపై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగవంశీ నిర్మాతగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom). ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే మొదటిరోజు గురువారం ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టినా, ఆ తర్వాత అనుకున్నంతగా ఈ సినిమాకు కలెక్షన్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగవంశీ.. పాజిటివ్ టాక్ వచ్చినంత మాత్రాన సినిమాలు హిట్ కావడం లేదంటూ ‘కుబేర’ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Also Read- Coolie: సూర్య ఇచ్చిన ఇంపాక్ట్ నాగార్జున ఇవ్వలేదా? ‘కూలీ’ ట్రైలర్‌పై ఈ కామెంట్స్ ఏంటి?

ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో మొదటి రోజు ప్రేక్షకులందరితో పాజిటివ్ టాక్‌ను తెచ్చుకునే సినిమా రానే లేదు. ఇకపై కూడా రాదు. ఎందుకంటే, కొందరికి నచ్చితే, ఇంకొందరికి సినిమా నచ్చడం లేదు. ప్రేక్షకులు మైండ్ సెట్ అర్థం కావడం చాలా కష్టమైపోతుంది. అందుకే కొందరు పాజిటివ్‌గా, కొందరు నెగిటివ్‌గా.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరికి నచ్చిన సినిమా, ఇంకొందరికి నచ్చడం లేదు. అంతెందుకు ‘కుబేర’ సినిమాను తీసుకుందాం. మొదటి రోజు అందరూ ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. కానీ ఫైనల్‌గా ఏమైంది? ఆ సినిమా లాస్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. అదే చెబుతుంది, వంద శాతం ఆడియెన్స్‌ని శాటిస్ ఫై చేసే సినిమా ఇకపై రావడం కష్టమే..’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Satyadev: మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందని అంటారు కదా! అలాగే?

‘కింగ్‌డమ్’ సినిమా గురించి మాట్లాడుతూ.. మా సినిమాకు కూడా కొందరు నెగిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. అయితే చాలా వరకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఇక కలెక్షన్స్ అంటారా? మొదటి రోజే బిజినెస్‌లో సగం వరకు వచ్చేశాయి. నిదానంగా కలెక్షన్స్ కూడా పెరుగుతాయని భావిస్తున్నాను. ప్రస్తుతానికైతే సేఫ్ జోన్‌లోనే ఉన్నాం, రాబోయే రోజుల్లో మా సినిమా రికార్డులను కొల్లగొడుతుందని అయితే చెప్పగలను అని అన్నారు. అయితే, నాగవంశీ చెప్పిన విషయం నిజమే. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా.. జనాలు థియేటర్లకు రావడం లేదు. పాజిటివ్ టాక్ కంటే కూడా ఇంకా ఏదో కావాలి ప్రేక్షకులకి. మరోవైపు ‘మహావతార్ నరసింహ’ సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అందులోనూ అది యానిమేషన్ చిత్రం. మరి ఆ సినిమాకు కలెక్షన్లు ఎందుకు వస్తున్నాయి? అంటూ నెటిజన్లు కొందరు నాగవంశీని ప్రశ్నిస్తుండటం విశేషం.

మరో వైపు ‘కుబేర’ ప్రస్తావన వచ్చినందుకు కూడా నాగవంశీపై ట్రోల్స్ పడుతున్నాయి. ఏదైనా ఉంటే నీ సినిమా గురించి చెప్పుకో.. ‘కుబేర’ సినిమా గురించి నీకెందుకు? ఈ నోటిదూలే తగ్గించుకుంటే మంచిది చింటూ..అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్