Kavitha vs Jagadeesh: కమాజీ మంత్రి జగదీష్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు. తనదైన శైలీలో కవిత విమర్శలు చేశారు. ఆయన నల్లగొండలో పార్టీ ఓటమికి కారణమని, ఆయనే చావుతప్పి గెలిచాడని విమర్శలు చేసింది. దీంతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి జగదీష్ రెడ్డి హుటాహుటినా వెళ్లారు. దీంతో కేసీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం. కవితపై ఎందుకు వ్యాఖ్యలు చేశావని నిలదీసినట్లు ప్రచారం జరుగుతున్నది.
Also Read: Tamannaah Bhatia: హీరోయిన్స్ కాస్మెటిక్ సర్జరీలపై ప్రశ్న.. బుర్రబద్దలయ్యే ఆన్సర్ ఇచ్చిన తమన్నా!
గులాబీ నేతల్లోనూ చర్చ
కవిత అంశం తాను చూసుకుంటానని చెప్పినప్పటికీ ఆమెపై ఎందుకు స్పందించామని జగదీష్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. మరోసారి వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్లు తెలిసింది. కేసీఆర్ ఆదేశాలతోనే మళ్లీ భవన్‌కు వచ్చి మీడియాతో జగదీష్ రెడ్డి మాట్లాడినట్లు సమాచారం. మీడియా ముందు జగదీష్ రెడ్డి ముఖం పాలిపోయినట్లు కొట్టొచ్చినట్లు కనబడింది. ఎప్పుడైనా ముఖం కలకలలాడేది. అయితే, ముఖ కవలికల్లోనూ తేడా రావడంతో గులాబీ నేతల్లోనూ చర్చకు దారితీసింది. గతంలో మీడియా ముందుకు విమర్శలకు పదును పెట్టే ఆయన.. ఈ స్థాయిలోనూ మాటలు లేకుండా సున్నితంగా మాట్లాడటంపై నేతలే చర్చించించుకుంటున్నారు.
Also Read: Coolie: సూర్య ఇచ్చిన ఇంపాక్ట్ నాగార్జున ఇవ్వలేదా? ‘కూలీ’ ట్రైలర్‌పై ఈ కామెంట్స్ ఏంటి?