Tamannaah Bhatia: బాలీవుడ్ అందాల తారలు.. తమ కాస్మెటిక్ సర్జరీల కారణంగా తరుచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతుంటారు. ఇటీవల షెఫాలి జరీవాల మరణం సందర్భంగానూ ఈ సర్జరీలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై స్టార్ హీరోయిన్ తమన్న భాటియా (Tamannaah Bhatia) ప్రశ్న ఎదురుకాగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ట్రోలర్స్, విమర్శకులకు తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమన్నా ఏం చెప్పారంటే?
బాలీవుడ్ లో లల్లన్ టాప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ తమన్నా భాటియా పాల్గొని మాట్లాడారు. సెలబ్రిటీల జీవితాల్లో ఏ చిన్న విషయం జరిగినా.. అది పెద్ద చర్చగా మారుతోందని అన్నారు. ‘మీడియా ఫోకస్ ఉన్న వారి గురించి మాట్లాడటం చాలా సులభం. ఎందుకంటే వారి జీవితాల గురించి మీకు తెలుసు. కానీ మీకు అసలు తెలియని చాలా మంది ఉన్నారు. వారికి సంబంధించిన విషయాలు మీకు ఎప్పటికీ తెలియవు కూడా. వాటిపై దృష్టిసారించాలి. మాలాంటి వారిపై చర్చించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అంటూ తమన్నా చెప్పుకొచ్చారు.
కాస్మెటిక్ సర్జరీల గురించి..
మరోవైపు బోటాక్స్ వంటి కాస్మెటిక్ విధానాల గురించి సైతం తమన్న మాట్లాడారు. ఈ జనరేషన్ యువత దానిని సులభంగా స్వీకరిస్తున్నారని చెప్పారు. ‘Gen-Z పిల్లలు దీనిపై చాలా ఓపెన్‌గా ఉంటారు. వారు ఏ ప్రక్రియ చేయించుకున్నా కూడా దాన్ని బహిరంగంగా చెబుతారు. ఎవరి స్టేట్ మెంట్స్ ను కోరుకోరు. ఎవరైనా ఏదైనా చెప్పినా వెంటనే వేలెత్తి చూపిస్తారు. కానీ సినిమాల్లో ఉన్న వారిపై మాత్రం చాలా స్టేట్ మెంట్స్ పాస్ చేస్తారు. సెలబ్రిటీలకు తమ వ్యక్తిగత జీవితం గురించి పంచుకోవడానికి సౌకర్యంగా ఉండకపోవచ్చు’ అని తమన్నా అన్నారు.
షెఫాలి విషయంలో ఏం జరిగిందంటే?
బాలీవుడ్ నటి షెఫాలి జరీవాలా (Shefali Jariwala).. జూన్ 27 రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె తన మరణానికి కొద్దిరోజుల ముందు యాంటీ ఏజింగ్ చికిత్స (Anti Aging Therapy)లో భాగంగా ఉపయోగించే గ్లూటాథియోన్ ఇంజెక్షన్‌లు తీసుకున్నారని.. వాటి కారణంగా సమస్య తలెత్తి ఉండవచ్చని పలు వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకూ ఆమె మరణానికి సంబంధించిన స్పష్టమైన కారణాలను అధికారులు వెల్లడించలేదు.
Also Read: Anasuya Bharadwaj: నా భర్త ఆ విషయంలో పర్ఫెక్ట్ కాదు.. హీరోలతో రొమాన్స్ చేస్తా.. అనసూయ కామెంట్స్
తమన్నా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్
తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న ‘వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ (Vvan: Force of the Forest) చిత్రంలో కనిపించనున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ (TVF) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది మేలో విడుదల కానుంది. మరోవైపు అమెజాన్ వెబ్ సిరీస్ ‘డేరింగ్ పార్ట్‌నర్స్’లో కూడా ఆమె నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆమెతో పాటు డయానా పెంటీ, నకుల్ మెహతా, జావేద్ జాఫ్రి నటిస్తున్నారు. ఈ సిరీస్ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.