HYDRA Commissioner( image credit: swetcha reporter)
హైదరాబాద్

HYDRA Commissioner: వరద ముంపు ప్రాంతాల్లో.. హైడ్రా కమిషనర్ పర్యటన!

HYDRA Commissioner: హైదరాబాద్ మహానగరంలో వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.  తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన దోయన్స్ కాలనీ, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఎగువ నుంచి వచ్చిన వరద గోపి చెరువుకు చేరే మార్గం లేకపోవడంతో శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం రోడ్డు, కాలనీ జలమయమయ్యాయని ఆయన గుర్తించారు.

వర్షం నీరు, గోపి చెరువు నుంచి వచ్చిన వరదతో లింగంపల్లి అండర్ పాస్‌లో నీరు నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. గోపి చెరువు, చాకలి చెరువులో నీటిమట్టం తగ్గిస్తే వరదను నియంత్రించవచ్చని సూచించారు. అంతకుముందు, వరద ముంపు ఉన్న కొండపూర్‌లోని కాసోరోస్ అపార్ట్‌మెంట్ పరిసరాలను పరిశీలించారు. వరద, మురుగు కాలువలను పూర్తిగా పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. అనంతరం బాచుపల్లిలోని పలు వరద కాలువలను పరిశీలించి, ఎస్ఎన్‌డీపీ కింద చేపట్టిన కాలువల నిర్మాణ పనులు వేగంగా జరగాలని ఆదేశించారు. చెన్నం చెరువు నుంచి వచ్చే వరద రామచంద్రాపురం కాలనీలో నిలవకుండా దిగువన ఉన్న బాచుపల్లి చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు.

 Also Read: Ponguleti Srinivas Reddy: వర్షాకాలానికి ముందస్తు ప్రణాళికలు.. మంత్రి కీలక అదేశాలు!

12 గంటల్లో చెక్..
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు, రాజేంద్రనగర్ మండలంలోని ఉప్పరపల్లి, శాస్త్రిపురం, పల్లె చెరువు ప్రాంతాలను బుధవారం సందర్శించిన హైడ్రా కమిషనర్, కేవలం 12 గంటల్లోనే పలు ప్రాంతాలకు పొంచి ఉన్న వరద ముప్పును నివారించారు. ఉప్పరపల్లిలోని అశోక్ విహార్ కాలనీలో మురుగు, వరద కాలువలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఎగువ నుంచి వచ్చే వరదలతో దాదాపు 5 అపార్ట్‌మెంట్ల నివాసితులు, 400 కుటుంబాలు ఏడేళ్లుగా అవస్థలు పడుతున్నాయని కమిషనర్‌కు విన్నవించారు.

150 మీటర్ల దూరంలో మూసీనదిని కలిపే ప్రధాన కాలువ ఉందని, దానికి అనుసంధానంగా కాలువ ఏర్పాటు చేస్తే తమ కాలనీకి వరద, మురుగు ముప్పు తప్పుతుందని స్థానికులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిధులు మంజూరైనా భూ యజమానులు పనులకు అనుమతించడం లేదని వారు వాపోయారు. అపార్ట్‌మెంట్‌లో మురుగు నీరు నిలిచిపోతోందని కమిషనర్‌కు చూపించారు. కాలువను తవ్వి సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు గురువారం కాలువలను తవ్వించి సమస్యను పరిష్కరించారు. ఏడేళ్ల సమస్యకు 12 గంటల్లో పరిష్కారం చూపడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

పల్లె చెరువు పరిశీలన..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మైలార్‌దేవ్‌పల్లిలోని పల్లె చెరువు అవుట్‌లెట్‌ను కూడా పరిశీలించారు. గతంలో ఈ చెరువు కట్ట తెగి రోడ్డుపై వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయి పలువురు మృతి చెందిన విషయాన్ని స్థానికులు కమిషనర్‌కు గుర్తు చేశారు. అవుట్‌లెట్‌ను విస్తరించాలని కోరారు. ఆ దగ్గరలోని శాస్త్రిపురంలో ఎకరన్నర పార్కు కబ్జాను కమిషనర్ పరిశీలించారు. ఈ పార్కుకు సంబంధించిన వివరాలు తీసుకుని, ఆక్రమణదారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు ఆడుకునే స్థలాన్ని తమదని చెప్పి కబ్జా చేశారని స్థానిక మహిళ కమిషనర్‌కు విన్నవించారు. పార్కును పునరుద్ధరించాలని కోరారు. పరిశీలించి లేఅవుట్ ప్రకారం పార్కును కాపాడుతామని కమిషనర్ హామీ ఇచ్చారు.

 Also Read: Teacher Eligibility Test: టెట్ అభ్యర్థులకు ‘పరీక్ష’ తప్పట్లేదు.. ఈనెల 18 నుంచి 30వరకు ఎగ్జామ్స్!

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?