Hyderabad Rail Alert: ఉదయాన్నే మేఘావృతం.. ఆ కొద్దిసేపటికి ఎండ.. మరికాసేపట్లో మళ్లీ మబ్బులు.. మధ్యాహ్నం లేదా, సాయంత్ర వేళల్లో వానలు.. ఇదీ గతం వారం రోజులుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితులు. నగరంలో ఏవో కొన్ని ప్రదేశాల్లో కచ్చితంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం వాతావరణంపై ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ (ట్విటర్ పేజీ) కీలకమైన అప్‌డేట్ (Hyderabad Rail Alert) అందించింది. వాతావరణ అంచనాల ప్రకారం, మంగళవారం కూడా పలుచోట్ల వర్షాలు మొదలయ్యాయి. సిటీలోని మల్కాజ్‌గిరి, ఉప్పల్, కాప్రా, ఉస్మానియా యూనివర్సిటీ, నాచారం, తార్నాకతో పాటు సికింద్రాబాద్ – హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రదేశాల్లో వర్షం పడుతోంది.
రానున్న 2 గంటల్లో కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు పడతాయని ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ అప్రమత్తం చేసింది. స్వల్పం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, రానున్న 1 గంట వ్యవధిలో రామంతపూర్, ఎల్‌బీ నగర్, సరూర్‌నగర్, వనస్థలిపురం, చార్మినార్, నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాలకు కూడా వానలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. రాగల కొన్ని గంటలపాటు, అంటే రాత్రి సమయంలో కూడా కొన్నిచోట్ల వర్షాలు ఉంటాయని, వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది.
Read Also- Free ChatGPT: ఉచితంగా చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్.. ఆశ్చర్యపరిచే నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!
తెలంగాణ జిల్లాల్లో ఇలా…
రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ అప్రమత్తం చేసింది. నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో తీవ్రమైన ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు పడతాయని హెచ్చరించింది. రాగల 3 గంటల్లో ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలను వర్షాలు తాకే అవకాశం ఉందంటూ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ట్వీట్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. రాగల 2 గంటల్లో రంగా రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో తీవ్రమైన మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత 2 గంటల్లో నల్గొండ, వనపర్తి, యాదాద్రి-బోనగిరి జిల్లాల్లోకి వర్షాలు విస్తరిస్తాయని వివరించింది.
Read Also- Health Tips: పండ్లు తిన్న వెంటనే నీరు తాగుతున్నారా.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన ఆరోగ్య నిపుణులు
మొదలైన శీతాకాలం!
ఈ రెండు రోజులు అక్కడక్కడా కురవబోయే వర్షాలు ఈ ఏడాది వానాకాలంలో చివరివి కావొచ్చని అంచనాగా ఉంది. చలికాలం దాదాపుగా వచ్చింది. సాధారణంగా, మనదేశంలో నవంబర్ నెల నుంచి శీతాకాలం ప్రారంభమవుతుంది. డిసెంబర్, జనవరి నెలల్లో చలితీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ ఏడాది నవంబర్ నెలలో వాతావరణంలో అసాధారణ మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాలలో, పగటిపూట చల్లగా ఉండి, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా (వెచ్చగా) నమోదవ్వొచ్చని ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. సాధారణంగా అయితే నవంబర్ ప్రారంభంలోనే స్వెట్టర్లు బయటకు తీయాల్సి వచ్చేది. కానీ, ఏడాది వానలు పడుతుండడంతో చలితీవ్రత పెద్దగా లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
