STP Projects: కేంద్ర ప్రభుత్వ అమృత్ 2.0 స్కీమ్ లో భాగంగా నిర్మిస్తున్న 39 సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల నిర్మాణంపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి(Ashock Reddy) సమీక్ష నిర్వహించారు. కొత్త ఎస్టీపీల పనులను దసరా పండుగ లోపు ప్రారంభించాలని ఆయన డెడ్ లైన్ విధించారు. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్- 2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్ల వ్యయంతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చింది. రెండు ప్యాకేజీ – 2 కింద నిర్మించనున్న 39 ఎస్టీపీల పురోగతిని ఎండీ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. భూవివాదాలు లేకుండా భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్లను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు.
భూ వివాదాలు ఉన్న ప్రాంత స్థానిక కలెక్టర్ లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయమని ఎస్టేట్ ఆఫీసర్ ను ఆదేశించారు. భూవివాదాలు ఉన్న ప్రాంత ఎస్టీపీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతంలో భూమిని గుర్తించాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే స్థలభావం, తక్కువ స్థలంలో ఎక్కువ సామర్థ్యం కల్గిన ఎస్టీపీలను నిర్మించే అవకాశాలను అధ్యయనం చేసి దానికి సంబంధించిన టెక్నాలజీని అన్వేషించాలని అధికారులను ఎండీ కోరారు.
Also Read: BJP Bike Rally: ఆ జిల్లాలో కృష్ణమ్మ ప్రవహిస్తున్న.. నీటి నిల్వలు ఆర కోరే!
ఎస్టీపీ ప్రాజెక్టుల వివరాలు
సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అమృత్ 2.0 స్కీమ్ కింద మొత్తం 39 ఎస్టీపీలను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మొత్తం ఎస్టీపీల సామర్థ్యం 972 ఎంఎల్ డీలు కాగా, వీటి నిర్మాణానికి వేసిన అంచనా వ్యయం రూ.3849.10 కోట్లు. కాగా, వీటిని అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐక్రిసాట్, ఉష్కేబావి, బాచుగూడ, తిమక్క చెరువు, గాంధీ గూడెం, పీర్జాదిగూడ, నాగారం, నర్సింగ్ (ఓఆర్ఆర్), సాంగం (బాపూఘాట్), హైదర్‌షాహ్‌కోట, ఫతే నగర్, చిట్రాపురి కాలనీ, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, మీర్‌పేట్, మసాబ్ చెరువు, కాప్రా, రవిర్యాల్, బొంగులూరు వంటి ప్రాంతాలలో నిర్మించాలని ప్రతిపాదించారు.
ప్యాకేజీ–1 కింద మొత్తం 16 ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించగా, వీటి మొత్తం సామర్థ్యం 493.50 ఎంఎల్ డీలు, కాగా, వీటి నిర్మాణానికి అంచనా వ్యయంగా రూ. 1878.55 కోట్లుగా నిర్ణయించారు. ప్యాకేజీ-2 కింద మరో 22 ఎస్టీపీలను మొత్తం 471.50 ఎంఎల్ డీల సామర్థ్యంతో నిర్మించాలని యోచించగా, వీటి అంచనా వ్యయం రూ. 1906.44 కోట్లుగా నిర్ణయించారు. వీటితో పాటు పటేల్ చెరువు ప్రాంతంలో మరో ఎస్టీపీని పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్(పీపీపీ) పద్దతిని నిర్మించాలని నిర్ణయించారు. 7 ఎంఎల్ డీల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ఎస్టీపీ నిర్మాణ అంచనా వ్యయం రూ. 64.11 కోట్లు గా నిర్ణయించారు.
Also Read: Telangana Govt: సీబీఐ విచారణపై జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక వేటు తప్పదా..?