BJP Bike Rally ( image crdit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

BJP Bike Rally: ఆ జిల్లాలో కృష్ణమ్మ ప్రవహిస్తున్న.. నీటి నిల్వలు ఆర కోరే!

BJP Bike Rally:  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు బీజేపీ పార్టీ(BJP)శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై బైక్ ర్యాలీ చేపట్టగా ముఖ్య అతిధిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి కె అరుణ(D.K. Aruna) హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రాంగణం ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆమె వారిని ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్ సంతోష్(District Collector Santosh) తో సమావేశమై జిల్లాలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు.

Also Read: Crows: కాకితో జాగ్రత్త.. పగబట్టిందో మీ పని ఔట్.. దాని జీవితాంతం మీరే శత్రువు!

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..
బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు ఎ పార్టీలో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యే తో గద్వాల జిల్లా అభివృద్ధి కుంటు పడిపోయిందన్నారు. గత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ప్రస్తుత కాంగ్రేస్ పార్టీ లోకి అభివృద్ధి పేరున పార్టీ మారిన ఎమ్మెల్యే నేటికీ జోగులాంబ గద్వాల జిల్లా మాత్రం అభివృద్ధిలో గుండు సున్నా సాధించారని ఆమె విమర్శించారు. కేవలం ఆయన స్వలాభం కోసమే పార్టీ మారారన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ రోడ్లపై నేటికీ తట్టడు మట్టి వేయలేదన్నారు. కేవలం హడావిడిగా గుంతలలో మట్టిని వేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్నారు.

కృష్ణమ్మ ప్రవహిస్తున్న.. నీటి నిల్వలు ఆర కోరే

ఇరిగేషన్ విషయానికి వస్తే గతంలో ఆర్డీస్ ఆధునికరణ కోసం ఎన్నో పోరాటాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోక పొగ తుమ్మిళ్ల లిఫ్ట్ ను ప్రారంభం చేసిన నేటికీ పనులు పూర్తికాక అసంపూర్తిగా ఉన్నాయి. నెట్టంపాడు పథకం క్రింద ర్యాలంపాడు రిజర్వాయర్ కు 2 టిఎంసిల ప్రాజెక్టు ను 4 టి ఎంసిలకు పెంచి ఈ ప్రాంతానికి అభివృద్ధికీ కృషి చేస్తూ ఆ నాడే ర్యాలంపాడు లికేజిలపై రాష్ట్ర అధికారుల ద్రుష్టికీ తీసుకువెళ్ళం, నెట్టం పాడు కాల్వలో జమ్ముతో నిండిపోయి మట్టికుప్పలుగా పేరుకోపోయింది.ఈ ప్రాంతానికి ఇరిగేషన్ అధికారి వచ్చిన రివ్యూలకే సరిపోయిందే తప్ప ఒక్క రూపాయి కేటాయించి అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు. ఎండాకాలం వచ్చిందంటే తాగునీటి కోసం గద్వాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురిస్తోందన్నారు.

కోర్టుల నిర్మాణం జిల్లా కేంద్రంలో చేపట్టాలి

మెజార్టీ న్యాయవాదుల కోరిక మేరకు జిల్లా కేంద్రంలోని కోర్టుల నిర్మాణాలు చేపట్టాలని డీకే అరుణ(D.K. Aruna) జిల్లా కలెక్టర్ ను కోరారు. గద్వాల మండలం అనంతపురం గ్రామం సమీపంలో కోర్టుల నిర్మాణాల వల్ల రాకపోకల కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, జిల్లా కేంద్రంలోని స్థలం కేటాయించి న్యాయవాదుల న్యాయమైన కోరికను నెరవేర్చాలన్నారు.

 Also Read: Director Krish: అనుష్క విశ్వరూపాన్ని చూస్తారు.. ‘ఘాటి’పై దర్శకుడు క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం