Hyderabad Prajavani: హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 246 ఆర్జీలను స్వీకరించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ కదిరవన్ పలని వెల్లడించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావాణిలో అందచేసిన ఆర్జీలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
రెవెన్యూ 41, ఇతర శాఖలు 18 కలిపి మొత్తం 246 ఆర్జీలు
ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజావాణి ముఖ్య ఉద్ధేశమని, విన్నపాలను వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల వాట్సాప్ నెంబరు ద్వారా వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిష్కరించాలని ఆయన సూచించారు. అలాగే జిల్లాలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ లో వచ్చిన ధరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అవరమైతే క్షేత్ర స్ధాయిలో పర్యటించి, త్వరితగతిన పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని కూడా ఆయన సూచించారు. ప్రజావాణిలో హౌజింగ్ శాఖ కు సంబంధించి (డబుల్ బెడ్ రూమ్ – 30, ఇందిరమ్మ ఇండ్లు 153), పెన్షన్స్ 4, రెవెన్యూ 41, ఇతర శాఖలు 18 కలిపి మొత్తం 246 ఆర్జీలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. వెంకటి, కలెక్టరేట్ ఇన్ చార్జి ఎ.ఓ విజయ లక్ష్మీ, జిల్లా సర్వే అధికారి శ్రీరామ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్జీదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: AV Ranganath: కబ్జాల పాలైన భూములను కాపాడటమే హైడ్రా లక్ష్యం : కమిషనర్ రంగనాధ్
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 226 ఆర్జీలు
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 60 విన్నపాలు, ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 166 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అందులో కూకట్ పల్లి జోన్ లో 72, ఎల్బీనగర్ జోన్ లో 18, సికింద్రాబాద్ జోన్ లో 29, శేరిలింగంపల్లి జోన్ లో 35, చార్మినార్ జోన్ లో 10, ఖైరతాబాద్ జోన్ లో 2 ఫిర్యాదులొచ్చినట్లు కూడా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ లు వేణు గోపాల్ , సుభద్రాదేవి, సత్యనారాయణ, మంగతాయారు, వెంకన్న, చీఫ్ ఇంజనీర్ (మెయింటనెన్స్ ) సహదేవ్ రత్నాకర్, జాయింట్ కమిషనర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Minister Sridhar Babu: స్కిల్ వర్సిటీకి సహకరించండి.. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి!

