Minister Sridhar Babu( image credit: twitter)
తెలంగాణ

Minister Sridhar Babu: స్కిల్ వర్సిటీకి సహకరించండి.. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి!

Minister Sridhar Babu:  తెలంగాణను స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబల్”గా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skill University) అభివృద్ధికి సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు,(Sridhar Babu) కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని (Jayant Chaudhary) కోరారు. నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. బషీర్‌బాగ్‌లోని పీజీ లా కళాశాలలో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్షిప్ (భారత ప్రభుత్వం), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (తెలంగాణ) సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మెగా జాబ్ (Mega Job) స్కిల్ & లోన్ మేళా”ను కేంద్రమంత్రి జయంత్ చౌదరితో (Jayant Chaudhary) కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.

 Also Read: GHMC Commissioner: అర్జీల పరిష్కారంలో.. జాప్యం వద్దు!

యువతలో 80 శాతం మందికి ఉద్యోగాలు

తెలంగాణ (Telangana) యువత ప్రతిభే మా రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద ఆస్తి. కానీ, చాలా మందిలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు ఉండటం లేదు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నెలకొన్న అంతరాన్ని రేవంత్ రెడ్డి (Revanth Reddy)   నేతృత్వంలోని మా ప్రభుత్వం గుర్తించింది” అని వివరించారు. తమది అందర్నీ కలుపుకొని పోయే ప్రభుత్వమని, నైపుణ్యాభివృద్ధిలోనూ పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. వారి సహకారంతోనే స్కిల్ యూనివర్సిటీలో కోర్సులకు రూపకల్పన చేస్తున్నామని, ఇక్కడ శిక్షణ తీసుకున్న యువతలో 80 శాతం మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు.

మీలో ఎంతో ప్రతిభ ఉంది.

యువతను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “మీలో ఎంతో ప్రతిభ ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు మారాలి. టెక్నాలజీ సాయంతో కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు ప్రయత్నించండి. ఓటమికి నిరుత్సాహం చెందకుండా ప్రయత్నం చేస్తూనే ఉండండి. తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు” అని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించాలని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) కేంద్ర మంత్రి జయంత్ చౌదరిని (Jayant Chaudhary) ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Minister Seethakka: పొగరుతో కేటీఆర్‌.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు