Minister Seethakka: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగా జైలుకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy) రెచ్చగొడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, (KTR) కవితల (Kavitha) మధ్య పోటీ ఉందని సీతక్క (Seethakka) అభిప్రాయపడ్డారు. కవిత (Kavitha) జైలుకు వెళ్లి వచ్చి బీసీ ఎజెండా ఎత్తుకుందని, తాను వెనుకబడ్డానని భావించి కేటీఆర్ కూడా జైలుకు వెళ్లి ఏదైనా పథకం రచించాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ఆశించి కేటీఆర్ (KTR) జైలుకు వెళ్లాలనుకుంటున్నారని మండిపడ్డారు.
తోడేళ్ళ లాగా రాష్ట్రాన్ని దోచుకొని, ఇప్పుడు కొంగ వినయం ప్రదర్శిస్తున్నారని బీఆర్‌ఎస్ (Brs) పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ (KTR) పొగరుతో మాట్లాడుతున్నారని, తమ సీఎం పౌరుషంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై త్వరలోనే స్పష్టత వస్తుందని సీతక్క (Seethakka) తెలిపారు. అయితే తాను స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే అన్నానని, కానీ ఎన్నికల తేదీ చెప్పినట్లుగా మీడియాలో ప్రచారం జరిగిందని, అది అవాస్తవం అని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకుని వార్తలు వేయాలని సూచించారు.
Also Read: Uttam Kumar Reddy: పోలవరం మార్పులను తిరస్కరించండి.. మంత్రి డిమాండ్!
తాను అనని మాటలు అన్నట్లుగా వార్తలు నడపడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. కార్యకర్తల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వారం పది రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని, కానీ వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని, నోటిఫికేషన్ విడుదలవుతుందని కొందరు వార్తలు రాశారని మండిపడ్డారు. తాను వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని చెప్పినట్లుగా ఒక్క ఆధారం అయినా చూపిస్తారా అని ప్రశ్నించారు. 20 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్నానని, లోకల్ ఎన్నికలు ఎలా జరుగుతాయో తనకు తెలియదా అన్నారు.
క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయం సాకారమవుతుందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఎన్నికలు ఆలస్యం అయ్యాయని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం చేతిలో ఉందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి అట్టడుగు వర్గాలను అణగదొక్కని బీఆర్‌ఎస్ (BRS) ఇప్పుడు బీసీలకు 42 శాతం అని కూనిరాగాలు తీస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ (Congrees) తోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
Also Read: CM Revanth Reddy: రైతు భరోసా నిధుల విడుదల.. వచ్చే 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు!