CV Anand: శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని హైదరాబాద్(Hyderabad) పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) చెప్పారు. 80లక్షల జనాభా ఉన్న నగరంలో నేరాలను నియంత్రించడానికి నిందితులను పట్టుకోవటానికి సిబ్బంది పని చేస్తున్న తీరును ఆయన అభినందించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 446మంది పోలీసులకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో రివార్డులు అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పని ఒత్తిడి అధికంగా ఉన్నా ఆయా నేరాలను తక్కువ సమయంలో పరిష్కరిస్తుండడం వల్లనే దేశవ్యాప్తంగా హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు దక్కుతోందన్నారు.
Also Read: KTR Vs Bandi Sanjay: బండి సంజయ్ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ సీరియస్
ఉత్తమ ప్రతిభ కనబరిచి రివార్డులు
ఉమెన్ సేఫ్టీ వింగ్ మహిళల భద్రతకు కృషి చేస్తోంటే సైబర్ క్రైం(Cyber crime) విభాగం సైబర్ నేరగాళ్లకు చెక్ పెడుతున్నదన్నారు. కమిషనరేట్‌లోని ప్రతీ విభాగం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది నేరాలను నియంత్రించడానికి, కేసులను పరిష్కరించడానికి గణనీయ కృషిని చేస్తున్నారన్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రివార్డులు సాధించిన అందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు సీపీ (శాంతిభద్రతలు) విశ్వప్రసాద్, నేర పరిశోధన విభాగం డీసీపీ ఎన్.శ్వేత తదితరులు పాల్గొన్నారు. రివార్డులు సాధించిన వారిలో 2 ఏసీపీలు, 49 మంది సీఐలు, 38మంది ఎస్ఐలు, 21మంది ఏఎస్ఐలు, 30మంది హెడ్ కానిస్టేబుళ్లు, 220మంది కానిస్టేబుళ్లు, 11మంది హోంగార్డులు, 45మంది మినిస్టీరియల్ సిబ్బంది, 25మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు.
Also Read: Ravichandran Ashwin: టీమ్ నుంచి నన్ను రిలీజ్ చేయండి.. సీఎస్కే స్టార్ ప్లేయర్ విజ్ఞప్తి
