Cyber Crime (imagecredit:AI)
హైదరాబాద్

Cyber Crime: సైబర్ క్రిమినల్స్ పై పోలీసులు ఉక్కుపాదం.. 22 మంది అరెస్ట్!

Cyber Crime: సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. వారం రోజుల్లోనే 14 సైబర్ మోసాల కేసులను ఛేధించి వేర్వేరు రాష్ట్రాల నుంచి 22మంది మోసగాళ్లను అరెస్ట్ చేశారు. ఇక, మోసగాళ్ల బారిన పడి డబ్బు పోగొట్టుకున్న బాధితులకు 69.19లక్షల రూపాయలను తిరిగి ఇప్పించారు.

సీపీ సృజన తెలిపిన ప్రకారం

సైబర్​ క్రైం డీసీపీ సృజన(DCP Srujana) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గతనెల 24 నుంచి 390వ తేదీ మధ్య సైబర్ క్రిమినల్స్ కమిషనరేట్ పరిధిలో 14 నేరాలకు పాల్పడ్డారు. వీటిలో 10 ట్రేడింగ్ ఫ్రాడ్​, 1 పార్ట్ టైం జాబ్​, 1 డిజిటల్ అరెస్ట్​, 1 ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్​, 1 జాబ్​ ఫ్రాడ్​ కేసులు ఉన్నాయి. ఈ మేరకు బాధితులు ఫిర్యాదులు చేయగా కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు విచారణ జరిపారు.

Also Read: Viral News: కోచింగ్ సెంటర్‌లో ప్రేమాయణం.. టీచర్‌ను పెళ్లి చేసుకున్న విద్యార్థిని.. ఆ తర్వాత..

1.16కోట్ల మోసం..

కమిషనరేట్ పరిధిలో నివాసముంటున్న ఓ మహిళకు ఇటీవల సైబర్​ క్రిమినల్స్​ వాట్సాప్ ద్వారా పరిచయం అయ్యారు. అనంతరం తాము చెప్పినట్టుగా పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయని నమ్మించారు. ఈ క్రమంలో ఆమెకు ఓ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ను పంపించారు. మొదట్లో బాధితురాలు చిన్న చిన్న మొత్తాలు పెట్టుబడులుగా పెట్టగా వాటిపై లాభాలు వచ్చినట్టుగా చూపించారు. దాంతో బాధితురాలు 1.16కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి పెట్టుబడులుగా బదిలీ చేసింది. ఆ తరువాత మోసం జరిగినట్టు గ్రహించి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు జరిపిన సైబర్ క్రైం పోలీసులు మహారాష్ట్ర వెళ్లి మోసానికి పాల్పడ్డ తేజస్ రాజేంద్ర శిర్సాత్, ప్రతీక్​ బాబాసాహెబ్​ భోస్లే, నిఖిల్ గణేశ్​ మోరే, ఆహిత్ కుమార్, నీరజ్​ బాబా బర్మాన్ లను అరెస్ట్ చేశారు. ఇక, 48 కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బులో 69.19 లక్షలను రికవరీ చేసి కోర్టుల అనుమతితో వారికి తిరిగి ఇచ్చారు.

Also Read; Nagarjuna: కింగ్ నాగార్జునకు బిగ్ రిలీఫ్.. రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Just In

01

Akhanda 2 release: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అఖండా 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Jagadish Reddy: 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదు: జగదీష్ రెడ్డి

IND vs WI First Test: తొలి టెస్టులో చెలరేగిన సిరాజ్.. పీకల్లోతూ కష్టాల్లో వెస్టిండీస్.. ఇక వార్ వన్ సైడేనా!

TG Government Lands: ల్యాండ్ పూలింగ్ పై ప్రభుత్వం ఫోకస్.. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి!

Airtel Recharge Plan: అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. రూ.199కే హైస్పీడ్ 5జీ, అపరిమిత కాల్స్.. వర్త్ మామా వర్త్!