తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Stock Fraud Crime: స్టాక్ ఫ్రాడ్ నేరాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్ కు బ్యాంక్ ఖాతాలను సమకూరుస్తూ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం డీసీపీ డీ.కవిత తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి, హైదరాబాద్ కు చెందిన ఓ సివిల్ ఇంజనీర్ కు కొంతకాలం క్రితం 9279871321 అన్న నెంబర్ నుంచి ఓ వాట్సాప్ మెసెజీ వచ్చింది. దానిని పంపించిన వ్యక్తి తాము సూచించినట్టుగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు వస్తాయని ఆశ పెట్టాడు.
Also Read: Saweety Boora: పోలీసు స్టేషన్ లో వాగ్వాదం.. భర్తపై దాడి చేసిన ప్రముఖ మహిళా బాక్సర్
ఓ లింకును పంపించి దానిని తెరిచి గ్రూప్ లో సభ్యునిగా చేరమన్నాడు. ఇది నమ్మిన బాధితుడు సదరు గ్రూపులో సభ్యునిగా చేరి మొదట్లో చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడులుగా పెట్టాడు. వీటికి సైబర్ క్రిమినల్స్ లాభాలను క్రెడిట్ చేశారు. ఆ మొత్తాలను బాధితుడు డ్రా కూడా చేసుకోగలిగాడు. అదే అదనుగా సైబర్ నేరగాళ్లు ఎంత ఎక్కవు డబ్బు పెట్టుబడులుగా పెడితే అంత ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పటంతో పలు దఫాలుగా 20 లక్షల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ చేశాడు.
Also Read: Betting Apps Promotion Case: విచారణకు డుమ్మా కొట్టిన విష్ణుప్రియ.. రీతూ చౌదరి.. కారణం అదేనా?
తాను సభ్యునిగా చేరిన గ్రూపులో చెక్ చేసుకుంటే లాభాలు వచ్చినట్టుగా కనిపించటం తప్పితే ఆ మొత్తం విత్ డ్రా కాకపోవటంతో బాధితుడు అదే విషయాన్ని సైబర్ నేరగాళ్లకు తెలిపాడు. ఇప్పుడే డబ్బు డ్రా కాదని, మరో 15లక్షలు పెట్టుబడులుగా పెట్టాలని వాళ్లు చెప్పటంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ కే.సతీష్ రెడ్డి ఎస్సై సురేశ్, కానిస్టేబుళ్లు రాజేశ్ కుమార్, రాము, మల్లేశంలతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Nuthankal Murder Vase: హత్య కేసులో.. 13 మంది అరెస్ట్
విచారణలో బాధితుడు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసిన 20లక్షల రూపాయలు హర్యానా రాష్ర్టం గురుగావ్ కు చెందిన హిమాన్షు స్వామి (28)తోపాటు పవన్ జైన్ అనే వ్యక్తుల ఖాతాల్లో జమ అయినట్టుగా తేలింది. ఈ నేపథ్యంలో సిబ్బందితో కలిసి గురుగావ్ వెళ్లిన సీఐ సతీష్ రెడ్డి నిందితుల్లో ఒకడైన హిమాన్షు స్వామిని అరెస్ట్ చేశారు. కాగా, పవన్ జైన్ పరారయ్యాడు. అరెస్టయిన హిమాన్షు స్వామికి ట్రై కమిషనరేట్లలో జరిగిన ఆరు ఫ్రాడ్ కేసులతో సంబంధం ఉన్నట్టుగా డీసీపీ కవిత తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు