Father Murders Son (imagecredit:swetcha)
హైదరాబాద్

Father Murders Son: మూడేళ్ల కొడుకును హత్య చేసి.. మూసీలో పారేసిన తండ్రి.. ఎక్కడంటే..?

Father Murders Son: కన్నతండ్రే కాల యముడయ్యాడు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకు(Son)కు చికిత్స చేయించాల్సింది పోయి ఊపిరి ఆడకుండా హత్య(Murder) చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఓ సంచీలో పెట్టి మూసీ నదిలోకి విసిరేశాడు. ఈ దారుణం బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నూర్ నగర్ నివాసులైన సనా బేగం, మహ్మద్ అక్భర్​ (35) భార్యాభర్తలు. అక్భర్ కూరగాయల వ్యాపారం చేస్తుండగా సనా బేగం కేర్​ టేకర్ ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, రెండో కుమారుడు అనాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యలకు చూపించినా ఆ చిన్నారి ఆరోగ్యం బాగు పడలేదు. ఈ విషయమై అక్భర్ తరచూ భార్యతో గొడవ పడేవాడు. తగ్గని రోగాలకు డబ్బు ఎందుకు ఖర్చే చేస్తున్నాంటూ తిట్టేవాడు.

ఊపిరి ఆడకుండా చేసి..

అయినా, సనా బేగం కొడుకుకు చికిత్స ఇప్పిస్తోంది. దాంతో అక్భర్(Akbar) కొన్ని రోజుల క్రితం అనాస్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూడటం మొదలు పెట్టాడు. శుక్రవారం రాత్రి భార్య డ్యూటీకి వెళ్లగా శనివారం తెల్లవారు ఝామున అనాస్ ముఖంపై దిండును అదిమి పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఆ తరువాత బ్యాగులో బాలుని మృతదేహాన్ని పెట్టి తన బైక్ పై అఫ్జల్ గంజ్ వద్దకు వచ్చాడు. బ్రిడ్జి పైనుంచి ఆ బ్యాగును మూసీ నదిలోకి విసిరేశాడు. తెల్లవారిన తరువాత ఏ పాపం తెలియదన్నట్టుగా నటిస్తూ బండ్లగూడ స్టేషన్​ కు వెళ్లి తన కుమారున్ని బంధువులు తీసుకెళ్లారని చెప్పాడు.

Also Read: GST 2.0: చిరు తిండ్లు తినేవారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఇక మీ పంట పండినట్లే!

ఫోన్ కాల్ రాలేదని నిర్ధారణ..

కొంతసేపు తరువాత బంధువులు అనాస్ ను తన ఇంటి వద్ద వదిలి పెట్టి వెళ్లారని తెలిపాడు. ఈ మేరకు తనకు ఫోన్ కూడా చేశారన్నాడు. అయితే, అనాస్ కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అక్భర్ చెప్పిన వివరాలు పొంతన లేని విధంగా ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు అక్భర్ మొబైల్​ ఫోన్ ను పరిశీలించగా అతనికి బంధువుల నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని నిర్ధారణ అయ్యింది. దాంతో తమదైన శైలిలో విచారించగా తానే అనాస్ ను హత్య చేసి మృతదేహాన్ని మూసీ నదిలోకి విసిరేసినట్టు అక్భర్​ అంగీకరించాడు. ఈ క్రమంలో హైడ్రా(Hydra) డీఆర్​ఎఫ్(DRDF)​ సిబ్బంది సహాయంతో పోలీసులు అనాస్(Anas) మృతదేహం కోసం మూసీ నదిలో గాలింపు చేపట్టారు.

Also Read: Hanumakonda District: రైతు రుణమాఫీ అయినా.. రుణం డబ్బులు వసూళ్లు.. ఎక్కడంటే..?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!