Hyderabad Metro (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు.. ఎంతంటే?

Hyderabad Metro: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. మెట్రో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈ నెల 17 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకూ ఉన్న కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి పెంచుతున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ ప్రకటించింది. మొదటి 2 స్టాపుల వరకు రూ.12, 2 నుంచి 4 స్టాపుల వరకు రూ.18 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే 4 నుంచి 6 స్టాపుల వరకు రూ.30, గరిష్ఠంగా రూ.60 నుంచి రూ.75కి పెంచుతున్నట్లు పేర్కొంది.

మెట్రో రైల్వేస్ చట్టం – 2002లోని సెక్షన్ 34 ప్రకారం ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు మెట్రో ప్రకటన విడుదల చేసింది.

పెరిగిన ఛార్జీల వివరాలు సమగ్రంగా..

❄️ తొలి రెండు స్టాప్‌లకు రూ.12
❄️ రెండు నుంచి 4 స్టాప్‌ల వరకు రూ.18
❄️ 4 నుంచి 6 స్టాప్‌ల వరకు రూ.30
❄️ 6 నుంచి 9 స్టాప్‌ల వరకు రూ.40
❄️ 9 నుంచి 12 స్టాప్‌ల వరకు రూ.50
❄️ 12 నుంచి 15 స్టాప్‌ల వరకు రూ.55
❄️ 15 నుంచి 18 స్టాప్‌ల వరకు రూ.60
❄️ 18 నుంచి 21 స్టాప్‌ల వరకు రూ.66
❄️ 21 నుంచి 24 స్టాప్‌ల వరకు రూ.70
❄️ 24 స్టాప్‌లు.. ఆపైన రూ.75

Also Read: Star Heroine: ఛాన్స్ ఇస్తే బన్నీతో ఆ పనికి రెడీ.. మరి ఒప్పుకుంటాడా?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!