Meerpet Murder Case (Image Source: ChatGPT)
హైదరాబాద్

Meerpet Murder Case: మీర్ పేట్ మాధవి హత్య కేసులో బిగ్ ట్విస్టు.. డీఎన్ఏ రిపోర్టులో సంచలన నిజాలు

Meerpet Murder Case: హైదరాబాద్ మీర్ పేటలో జరిగిన మాధవి హత్య కేసు ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భార్య మాధవిని ముక్కలుగా నరికిన భర్త గురుమూర్తి.. ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో గురుమూర్తిని దోషిగా నిర్దారించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఈ హత్య కేసుకు సంబంధించి కీలక ఆధారం లభించింది. గురుమూర్తిని న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టే బలమైన ఆధారం పోలీసుల చేతికి చిక్కింది.

డీఎన్ఏ రిపోర్టు
పక్కా ప్లాన్ తో మాధవిని గురుమూర్తి హత్య చేయడంతో పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. మాధవి శరీర భాగాలు గుర్తించినప్పటికీ అది ఆమెదేనని తేల్చేందుకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అవసరమైంది. దీంతో ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా గురుమూర్తిని గతంలోనే పోలీసులు అరెస్టు చేశారు. వాటిని డీఎన్ఏ పరీక్షకు పంపగా తాజాగా ఆ రిపోర్టు పోలీసులకు అందింది. తల్లి, పిల్లల డీఎన్ఏ మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. దీంతో గురుమూర్తిని న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టేందుకు పక్కా ఆధారం లభించినట్లైంది.

మాధవిని ఎందుకు చంపాడంటే
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి.. 13 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మాధవిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం ఆర్మీలో పనిచేసిన అతడు.. పదవి విరమణ పొంది హైదరాబాద్ కంచన్ బాగ్ లోని డీఆర్ డీఏలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే గురుమూర్తికి సమీప బంధువైన మహిళతో వివాహేతర బంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన మాధవి తరచూ అతడితో గొడవ పడేదని సమాచారం. భార్య నిత్యం వేధిస్తూ డామినేట్ చేస్తుందన్న ఆక్రోశంతో గురుమూర్తి ఆమె అతి దారుణంగా హత్య చేశాడు.

Also Read: Delimitation – TDP Alliance: ముందు నుయ్యి వెనక గొయ్యి.. ఇరకాటంలో కూటమి.. అసలేం జరుగుతోంది?

ముక్కులు చేసి.. రోటిలో దంచి
జనవరి 15 సంక్రాతి పండుగ రోజున గురుమూర్తి, మాధవి మధ్య మరోమారు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాధవి తలపై బలంగా మోదీ గురుమూర్తి హత్య చేశాడు. ఆపై మటన్ నరికే కత్తితో శరీరాన్ని ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత శరీర భాగాలను బకెట్ లో వేసి వాటర్ హీటర్ తో ఊడికించాడు. అనంతరం ఎముకలను ముక్కలుగా దంచి పొడి చేసి వాటిని చెరువులో పడేశాడు. హత్య జరిగిన తర్వాతి రెండ్రోజులు మద్యం సేవిస్తూ గురుమూర్తి ఇంట్లోనే ఉండిపోయాడు.

తొలుత మిస్సింగ్ కేసు
జనవరి 17న మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన గురుమూర్తి.. భార్య కనిపించడం లేదని వారికి చెప్పారు. దీంతో టెన్షన్ పడ్డ ఆమె తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్ వచ్చి ఆమె ఉంటున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో జనవరి 18న మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా గురుమూర్తి ఇంటికి వచ్చిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. మాధవి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు ఎక్కడా సీసీటీవీలో రికార్డు కాకపోవడంతో భర్త గురుమూర్తిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తమదైన శైలిలో గురుమూర్తిని విచారించగా ఈ సంచలన హత్య వెలుగుచూసింది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?