Hydra: రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ జాగీర్‌లో 4400 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా(Hydra) కాపాడింది. 96/2, 96/3 సర్వే నంబర్లలో 125 ఎకరాల మేర 582 ప్లాట్లతో పీ అండ్ టీ కాలనీ పేరిట 1989లో లే ఔట్ వేశారు. ఇందులోని 1200 గజాల పార్కు ఒకటి. 3200 గజాలతో మరో పార్కు స్థలం ఉంది. ఈ రెండింటినీ అభివృద్ధి చేయడానికి వీలు లేకుండా కబ్జాదారులు అడ్డుకుంటున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులు పార్కు చుట్టూ ప్రహరీని నిర్మించి కాపాడేందుకు ప్రయత్నించగా, కబ్జాదారులు అడ్డుకున్నారు.
Also Read: Telugu Movies: టీచర్స్ డే రోజున చూడాల్నిన చిత్రాలు ఇవే.. తర్వాత ఏం చేయాలో తెలుసా..
పార్కు స్థలాల చుట్టూ ఫెన్సింగ్
దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. దీనిపై హైడ్రా ప్రజావాణికి స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగి, లే ఔట్ ఆధారంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. పార్కు స్థలాలుగానే నిర్ధారించుకున్న హైడ్రా(Hydra) అధికారులు కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు కబ్జాలను తొలగించారు. వెంటనే పార్కు స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. పార్కులను కాపాడినట్టు బోర్డులు కూడా పెట్టారు. దశాబ్దాల సమస్యకు హైడ్రా(Hydra) తెరదించిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా(Hydra) కమిషనర్, అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read:Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిగ్ ట్విస్ట్?.. సీటుపై కన్నేసిన ఓ ఎమ్మెల్యే