H-Citi Project: గ్రేటర్ హైదరాబాద్ వాసుల అవసరాలకు తగిన విధంగా అభివృద్ది పనులతో పాటు అత్యవసర సేవలందించే బల్దియా బాసుకు కోపమొచ్చింది. మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్(Traffic) సమస్య నుంచి వాహనదారులకు ఉపశమనం కల్గించేందుకు గత సర్కారు హయాంలో ప్రతిపాదించిన స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం(Strategic Road Development Program) కింద ప్రతిపాదించిన పనులతో నగరంలో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చేపట్టిన పనుల్లో జాప్యం జరగటంపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) ఇంజనీరింగ్ వింగ్ పై తీవ్ర స్థాయిలో సీరియస్ అయినట్లు సమాచారం. చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్టులు) హెచ్ సిటీ పనులనెందుకు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. ఒకవైపు పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా మరో వైపు ప్రాజెక్టుల విభాగానికి చీఫ్ ఇంజనీర్ గా రెండు పదవుల్లో కొనసాగుతున్నా, ప్రతిష్టాత్మకమైన హెచ్ సిటీ పనులను కూడా పర్యవేక్షించాలని చీఫ్ ఇంజనీర్ కు సూచించినట్లు సమాచారం.
శంకుస్థాపన చేసిన పనుల్లో
రాష్ట్రంలో సర్కారు మారిన తర్వాత ఎస్ఆర్ డీపీ(SRDP)ని హెచ్ సిటీ(H-CITY) పనులుగా బదలాయించిన సర్కారు అయిదు ప్యాకేజీల కింద చేపట్టాల్సిన 25 ప్రాజెక్టులకు ఇప్పటి వరకు రూ. 7032 కోట్ల నిధులకు సర్కారు పరిపాలపరమైన మంజూరీని ఇచ్చింది. గత సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేసిన ఈ పనుల్లో నేటికీ ఒక్కటి కూడా మొదలు కాకపోవటంపై కమిషనర్ ఇంజనీర్లను గట్టిగానే ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా కేబీఆర్ పార్కు(KBR Park) వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, ఆరు అండర్ పాస్ ల ఏర్పాటుకు ఫీల్డు లెవెల్ లో అడ్డుంకులేమైనా ఉన్నాయా? అంటూ కమిషనర్ ఇంజనీరింగ్ వింగ్ పై తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. కేబీఆర్ పార్కు చుట్టూ ఈ ప్రాజెక్టుల కోసం సుమారు 269 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించే ప్రక్రియ ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని కమిషనర్ అడిగి తెల్సుకున్నారు.
Also Read: Mahabubabad District: నకిలీ పాసుపుస్తకాల ముఠా సభ్యులు అరెస్ట్..ఎక్కడంటే..?
అధికారులతో చర్చలు
స్థల సేకరణ ప్రక్రియ పూర్తయిన చోట పనులెందుకు చేపట్టడం లేదని కమిషనర్ ఆరా తీశారు. ముఖ్యంగా స్థల సేకరణ ఇంకా మొదలుకాని పనులకు సైతం ముందుగానే టెండర్లను ఆహ్వానించినట్లు, ఏజెన్సీలను ఎంగేజ్ చేసుకున్న తర్వాత స్థల సేకరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్ కు సమాధానం చెప్పినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని కూడా సేకరించాల్సి ఉందని ఇంజనీర్లు కమిషనర్ కు వివరించగా, స్థల సేకరణ విషయంలో తానే నేరుగా రక్షణ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు, సర్కారు సహాయంతో చర్చలకు మంచి ఫలితాలు వస్తున్నాయని కమిషనర్ వెల్లడించినట్లు సమాచారం. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రత్యామ్నాయ రోడ్ల ఏర్పాటు కోసం సేకరించిన స్థలానికి బదులుగా రక్షణ శాఖకు జవహార్ నగర్ లో రూ.420 కోట్ల విలువైన భూములు కేటాయించేందుకు సర్కారు సుముఖంగా ఉన్న నేపథ్యంలో నానల్ నగర్ జంక్షన్ లోని ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు హెచ్ సిటీ కింద ప్రతిపాదించిన హుమాయున్ నగర్ వాటర్ ఫిల్టర్ బెడ్ నుంచి నానల్ నగర్ జంక్షన్ మీదుగా టోలీచౌకీ ఫ్లై ఓవర్ కు కనెక్టివిటీగా ఏర్పాటు చేయనున్న మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ స్థల సేకరణ కోసం రక్షణ శాఖ అధికారులతో చర్చలు జరుపుత
నిరంతరం పర్యవేక్షించాలి
హెచ్ సిటీ పనులను వీలైనంత త్వరగా మొదలుపెట్టి, ఆయా ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే వరకు ఇంజనీరింగ్ విభాగంతో పాటు జోనల్ కమిషనర్లు కూడా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ కర్ణన్ ఆదేశించినట్లు సమాచారం. జోన్ల వారీగా జోనల్ కమిషనర్లు ఇకపై హెచ్ సిటీ పనులను, స్థల సేకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తూ వీక్లీ రిపోర్టులు సమర్పించాలని కమిషనర్ జోనల్ కమిషనర్లను ఆదేశించినట్లు తెల్సింది. ముఖ్యంగా కేబీఆర్ పార్కు చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హెచ్ సిటీ పనులపై మైక్రోలెవెల్ అబ్జర్వేషన్ అవసరమని కమిషనర్ సూచించినట్లు సమాచారం. కేబీఆర్ పార్కు చుట్టూ స్థల సేకరణకు సంబంధించి ఉన్న కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని, ప్రస్తుతం కోర్టు కేసుల్లేని ప్రాంతాల్లో పనులు మొదలు పెట్టాలని కమిషనర్ ఆదేశించినట్లు తెల్సింది.
Also Read: India–US partnership: చైనాలో మోదీ, పుతిన్ కలిసిన నిమిషాల వ్యవధిలోనే అమెరికా కీలక ప్రకటన