Hyderabad Excise ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Hyderabad Excise: ట్రావెల్​ ఏజెంట్​ ముసుగులో విదేశీ మద్యం దందా.. ఇద్దరు అరెస్ట్.. ఎలా పట్టుకున్నారంటే?

Hyderabad Excise: ట్రావెల్ ఏజెంట్ ముసుగులో విదేశీ మద్యం దందా చేస్తున్న వ్యక్తితోపాటు అతని సహచరున్ని ఎక్సయిజ్ హైదరాబాద్ ఎన్ ఫోర్స్ మెంట్ (Hyderabad Excise) పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 52 విదేశీ మద్యం బాటిళ్లతోపాటు ఓ కారు, టూ వీలర్ ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నివాసి సుమిత్ వృత్తిరీత్యా ట్రావెల్​ ఏజెంట్​. విదేశాలకు వెళ్లే వారి కోసం పాస్​ పోర్ట్. వీసా వంటి వాటిని సమకూరుస్తుంటాడు. ఇలా తన ద్వారా విదేశాలకు వెళ్లిన వారిలో కొందరితో విదేశీ మద్యం సీసాలను తెప్పించుకుంటూ మూర్తి యుగేంధర్​ తో కలిసి హైదరాబాద్ లో అధిక ధరలకు అమ్ముతున్నాడు.

Also Read: Telangana Excise: దుమ్ము రేపుతున్న ఎక్సైజ్ పోలీసులు.. రెండు రోజుల్లో 35 లక్షల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్

43 విదేశీ మద్యం బాటిళ్లను సీజ్

ఇలా తెప్పించిన 9 విదేశీ మద్యం సీసాలను విక్రయించటానికి యుగేంధర్ స్కూటీపై బోరబండ ప్రాంతానికి రాగా సీఐ చంద్రశేఖర్ గౌడ్ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లు ఎక్కడివని ప్రశ్నించగా మనీష్​ కుమార్ అనే వ్యక్తి ఇచ్చినట్టుగా యుగంధర్ వెల్లడించాడు. ఈ క్రమంలో మనీష్ కుమార్ ఇంట్లో తనిఖీలు జరిపిన ఎక్సయిజ్ పోలీసులు ఓ కారుతోపాటు మరో 43 విదేశీ మద్యం బాటిళ్లను సీజ్​ చేశారు. అతన్ని జరిపిన విచారణలో ట్రావెల్ ఏజెంట్ గా పని చేస్తున్న సుమిత్ ఈ బాటిళ్లను తెప్పించి ఇస్తుంటాడని వెల్లడైంది. అయితే, సుమిత్ పోలీసుల చేతికి చిక్కలేదు. యుగంధర్, మనీష్​ కుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు॥ విదేశీ మద్యం దందా చేస్తున్న నిందితులను పట్టుకున్న సీఐ చంద్రశేఖర్ గౌడ్ తోపాటు ఎస్​ఐ శ్రీనివాస్​, కానిస్టేబుళ్లు కరణ్​ సింగ్, శ్రీకాంత్​, సాయికుమార్​, గోపాల్​, ప్రసాద్ లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్​ ఖాసీం, డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్​ రెడ్డి, ఏఈఎస్ స్మిత సౌజన్యలు అభినందించారు.

Also Read: TG Excise Department: దరఖాస్తుల సంఖ్యను పెంచేందుకు.. అబ్కారీ సిబ్బంది తిప్పలు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?