TG Excise Department (imagecredit:twitter)
తెలంగాణ

TG Excise Department: దరఖాస్తుల సంఖ్యను పెంచేందుకు.. అబ్కారీ సిబ్బంది తిప్పలు

TG Excise Department: రండి బాబూ రండి.. మంచి తరుణం మించిన దొరకదు.. ఆబ్కారీ శాఖ సిబ్బంది నోట నుంచి ప్రస్తుతం వినిపిస్తున్న మాట ఇది. అదేంటి.. ఏమైనా మార్కెటింగ్​ పని మొదలు పెట్టారా? అన్న డౌటానుమానం ఏమీ అక్కర్లేదు. రాబోయే రెండేళ్ల కాలానికి వైన్​ షాపులు కేటాయించనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్సయిజ్ సిబ్బంది వీలైనంత ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా చూడటానికి శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు టార్గెట్లు విధించటం.. రివ్యూ సమావేశాలు జరుపుతుండటంతో ఇప్పటికే వైన్ షాపులు నడుపుతున్న వారితోపాటు ఇంతకు ముందు ఇదే వ్యాపారం చేసిన వారు.. కాస్త డబ్బున్న వారితో అప్లికేషన్లు పెట్టుకోండి.. జాక్​ పాట్ కొట్టండి అని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కేవలం దరఖాస్తుల ద్వారానే 5వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరాలన్న హుకూం ఉండటంతో లక్ష్యాన్ని చేరుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

2,620 షాపులు..

రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 వైన్​ షాపులు నడుస్తున్నాయి. వీటి లైసెన్స్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది. ఆ తరువాత రెండేళ్ల కాలానికిగాను వైన్​ షాపులు కేటాయించేందుకు ప్రభుత్వం ఆగస్టు 20న నోటిఫికేషన్ ను జారీ చేసింది. దరఖాస్తులు చేసుకోవటానికి ఈనెల 18వ తేదీని గడువుగా ప్రకటించింది.

పెరిగిన ఫీజు..

గతంలో వైన్​ షాపు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 2 లక్షల రూపాయల నాన్​ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. అయితే, ఈసారి ఆ మొత్తాన్ని 3 లక్షల రూపాయలకు పెంచారు. ఇక, బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో మొత్తం 2,620 వైన్​ షాపులకుగాను 1.32లక్షల అప్లికేషన్లు వచ్చాయి. తద్వారా అప్పటి ప్రభుత్వానికి 2,640 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈసారి దరఖాస్తు ఫీజును 3 లక్షలకు పెంచటం…క్రితంసారికన్నా ఈసారి ఎక్కువ అప్లికేషన్లు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో కనీసం 5 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

Also Read: Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘SSMB29’ టైటిల్ ఇదేనా!..

అయితే..

ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఎక్సయిజ్ అధికారుల్లో కంగారు సృష్టిస్తోంది. ఆగస్టు 20న నోటిఫికేషన్​ జారీ చేయగా మూడు రోజుల క్రితం వరకు వచ్చిన దరఖాస్తులు కేవలం 1,581 మాత్రమే. ఓపెన్ కేటగిరీలోని 1,834 షాపుల కోసం 992 దరఖాస్తులు వచ్చాయి. గౌడ కులస్తులకు కేటాయించిన 393 దుకాణాలకు 223 అప్లికేషన్లు, ఎస్సీలకు కేటాయించిన 262 షాపులకు 55, ఎస్టీలకు కేటాయించిన 131దుకాణాలకు 13 దరఖాస్తులు అందాయి.

రంగంలోకి ఉన్నతాధికారులు..

ఈ క్రమంలో ఎక్సయిజ్​ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలవారీగా ఉన్న షాపులెన్ని? వచ్చిన దరఖాస్తులు ఎన్ని? అన్న వివరాలను సేకరిస్తున్నారు. సమీక్షా సమావేశాలు పెట్టి మరీ ఇలా అయితే కుదరదు…దరఖాస్తుల సంఖ్య పెరిగేలా చూడాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 5వేల కోట్ల టార్గెట్ పూర్తి కావాల్సిందేనని చెబుతున్నారు. దాంతో ఆయా ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఉరుకులు పరుగులు మొదలు పెట్టారు. తమ తమ స్టేషన్ల పరిధుల్లోని వైన్ షాపులకు వీలైనంత ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చేలా చూడటానికి పడరాని పాట్లు పడుతున్నారు.

దీనిపై ఎక్సయిజ్​ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారితో మాట్లాడగా ఇది ప్రతీసారి జరిగే తతంగమని వ్యాఖ్యానించారు. మొదట్లో దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వచ్చినా చివరి వారంలో ఒక్కసారిగా పెరిగి పోతాయన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు సైతం తెలంగాణ వారితో సిండికేట్ గా ఏర్పడి వైన్ షాపుల కోసం దరఖాస్తులు చేసుకుంటారన్నారు. శనివారం పంచమి ఉన్న నేపథ్యంలో అప్పటి నుంచి అప్లికేషన్లు జోరందుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక, దరఖాస్తు చేసుకోవటానికి ఈనెల 18వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని గుర్తు

Also Read: GHMC: జీహెచ్ఎంసీ పనుల్లో అలసత్వానికి చెక్.. పనుల వేగం కోసం డ్యాష్ బోర్డు ఏర్పాటు

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు