ssmb29(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘SSMB29’ టైటిల్ ఇదేనా!..

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టైటిల్ పై ఇప్పటికే బజ్ నెలకొంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిని పోలిన పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ క్రమంలో సినిమా టైటిల్ కూడా ‘వారణాసి’గా దర్శకుడు కన్ఫామ్ చేశాడని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అసలే రాముడిలా ఉంటాడంటూ ఊహించుకునే మహేష్ ఫ్యాన్ వారణాసి పేరుకు ఫల్ సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి నిర్మాతలు, దర్శకుడు కానీ అధికరికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్ నవంబర్ లో రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రియాంక చోప్రా, మహేష్ బాబులతో షూటింగ పూర్తయిందని వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా అప్టేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.

Read also-Srinivas Goud: బీసీరిజర్వేషన్లుకు చట్టబద్దత కల్పించాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

‘SSMB29’ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలతో కూడిన ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది సూపర్‌స్టార్ మహేష్ బాబు 29వ సినిమాగా రూపొందుతోంది. అందుకే SSMB29 అని ప్రాజెక్ట్ పేరు. డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి హిట్‌ల తర్వాత ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా చెబుతున్నారు. ఈ సినిమా అధికారిక టైటిల్ “వరానాసి”గా ప్రచారం అవుతోంది. ఇది పురాతన నగరం వారణాసి ఆధ్యాత్మిక సాంస్కృతిక మూలాల నుండి ప్రేరణ పొందింది.

Read also-Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌లో ప్రచార సామాగ్రి తొలగింపు.. సభలు, సమావేశాలకు పర్మిషన్ కావాల్సిందే!

ఈ చిత్రం యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ జానర్‌లో ఉంటుంది. మిథాలజీ, ప్రకృతి, ఎక్స్‌ప్లోరేషన్‌ను కలిపి అడ్వెంచర్‌గా రూపొందించబడింది. కథాంశం ప్రకారం, ఒక పురావస్తు శాస్త్రవేత్త (మహేష్ బాబు పాత్ర) లార్డ్ హనుమంతుని లక్షణాలతో కూడినవాడు, అమెజాన్ అడవులు ఆఫ్రికా భాగాల్లో ప్రపంచవ్యాప్త అడ్వెంచర్‌కు పయనిస్తాడు. భవిష్యత్తు భాగ్యం ఆయనకు మరిన్ని రహస్యాలను వెల్లడి చేస్తుందని చెబుతున్నారు. మహాభారతం నుండి ప్రేరణలు తీసుకుని, మహేష్ బాబు ఒక కొత్త అవతారంలో కనిపిస్తాడు. పాన్-వరల్డ్ ఫిల్మ్‌గా, తెలుగులో తీస్తున్నప్పటికీ పాన్-ఇండియా రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విశేషాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది