Srinivas Goud: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో బుధవారం మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు బాలరాజు యాదవ్, పల్లె రవికుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. 22 నెలలు మాట్లాడకుండా ఇప్పుడు హడావుడి గా 42 శాతం రిజర్వేషన్ లు అంటున్నారని మండిపడ్డారు. చట్ట బద్ధత తో ఇస్తాం అని ఎందుకు చట్ట బద్ధత లేదు అని నిలదీశారు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగా జీవో 9 ఎందుకు ఇచ్చారని హై కోర్టు కూడా అడుగుతుందన్నారు.
Also Read: Gatha Vaibhava: పవన్ కళ్యాణ్ అద్భుతమైన మాట చెప్పారు.. అందుకే తెలుగు నేర్చుకుని వచ్చానన్న హీరో!
బీహార్ ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లు
మహారాష్ట్ర ఎన్నికల కోసం కులగణన చేశారని, బీహార్ ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లు చేస్తున్నారని, ఎన్నికల డ్రామా తప్ప ఏమీ లేదని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కోర్టు కొట్టి వేస్తే పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేశారు. గెలిచిన వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎటు పోతారు.. రాజకీయం కోసమే హై కోర్టు దగ్గర పోయి హంగామా చేస్తున్నారని ఆరోపించారు.హై కోర్టు ఒప్పుకుంటే సంతోషమే.. కానీ జడ్జి ప్రశ్నలకు సమాధానం లేదన్నారు.
ఓసీ మంత్రులు వ్యతిరేకమా?
బీసీ మంత్రులు మాత్రమే హై కోర్టు కు వెళ్లారు.. ఓసీ మంత్రులు వ్యతిరేకమా? అన్నారు. రాష్ట్రపతి వద్ద బిల్ ఆమోదింపచేస్తామంటే అసెంబ్లీలో మేము మద్దతు ఇచ్చామని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రయోగశాలగా మార్చిందన్నారు. బీసీలు, ఓసీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ అవసరాల కోసం బీసీలను బలిపశువులను చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే బీ ఆర్ ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారని, గెలిచిన వారు పదవులు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నని అన్నారు.
Also Read: Medchal: బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి.. పటాకులు కాల్చే వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ఎన్నికలు వాయిదా వేయడమే వారి లక్ష్యం.. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి తన సొంత పార్టీ బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “పార్టీ అన్నాక తప్పులు అన్ని చోట్లా ఉంటాయి, కానీ వికారాబాద్ బీజేపీలో మాత్రం కొంత ఎక్కువగా ఉన్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తప్పులను పార్టీ సరిదిద్దుతుందని తాను ఆశిస్తున్నానని, పార్టీలో లోపాలు జరిగితే వాటిని గుర్తించి సరిదిద్దాలని సూచించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యం
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తాము గ్రౌండ్ లెవల్లో పనిచేస్తున్నామని, తెలంగాణలో బీజేపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న ‘ఆపరేషన్ సింధూర్, ట్రంప్ విధానాలపై నిర్ణయాలు’, జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు వంటి చర్యలతో ప్రజల్లో ఆయనపై విశ్వాసం పెరిగిందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలే తమ విజయానికి పునాదులు అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడే ఎన్నికలు జరిగితే బీజేపీకే అడ్వాంటేజీ అని ఆయన చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Also Read: Warangal Collector: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
