Hyderabad District Collector: చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న ఎగ్ బిర్యానీ చాలా బాగుందని, సూపర్ టేస్ట్‌గా ఉందని హైదరాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ (Hyderabad District Collector) హరి చందన దాసరి (Chandana Dasari) ప్రశంసించారు. ఆమె నాంపల్లి నియోజకవర్గంలోని ఎంజీ నగర్, మురాద్ నగర్, చాచా నెహ్రూ నగర్‌లలోని అంగన్‌వాడీ కేంద్రాలు, (Anganwadi Schools) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంధుల హాస్టల్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని (Anganwadi Schools) సందర్శించి రిజిస్టర్లు, మెనూ ప్రకారం అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా అందిస్తున్న ఎగ్ బిర్యానీని స్వయంగా రుచి చూసి, “భేష్‌గా ఉంది” అని వ్యాఖ్యానించారు. పిల్లలకు మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు ఎగ్ బిర్యానీని అందించాలని ఆదేశించారు.
పిల్లలతో ముచ్చట..
అంగన్‌వాడీ పాఠశాలలోని (Anganwadi Schools)పిల్లలు కలెక్టర్‌కు గులాబీ పువ్వులు అందిస్తూ స్వాగతం పలకగా, కలెక్టర్ చిరునవ్వుతో స్వీకరించారు. “మీరు ఎలా చదువుతున్నారు? మీ టీచర్లు మంచి పాఠాలు చెబుతున్నారా?” అంటూ పిల్లలను ప్రశ్నించారు. పిల్లలు ఆటవస్తువులతో ఎక్కువ సమయం గడిపేలా చూడాలని టీచర్లకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రంలో (Anganwadi Schools) ఉన్న స్టోర్‌ను పరిశీలించి, దానిని పక్కనే ఉన్న (Primary school) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనికి మార్చాలని సీడీపీఓను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే తాగునీరు, విద్యుత్ సమస్య లేకుండా చూడాలని సూచించారు. కేంద్రానికి వచ్చిన బాలింతలు, గర్భిణులకు (pregnant women) అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అందుతున్న ఆహార పదార్థాలు, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
Also Read: Komati Reddy Venkata Reddy: అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి ఆదేశం!
అంధుల హాస్టల్ తనిఖీ..
అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల . (Primary school) (ఉర్దూ మీడియం), మురాద్ నగర్, చాచా నెహ్రూ నగర్ పాఠశాలలను సందర్శించి, పాఠశాలలోని వాష్ బేసిన్‌లు, టాయిలెట్‌లను పరిశీలించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని హెడ్ మాస్టర్‌ను ఆదేశించారు. (Primary school) ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలతో పాటు తరగతి గదులను శుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు.
పాఠశాలలో యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే పాఠశాల కమిటీలో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. తదుపరి, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల హాస్టల్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడున్న అంధులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అంధులకు మెరుగైన సేవలు అందించాలని, నిరంతరం పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయాలని సూచించారు. ఈ కేంద్రంలో ఎక్కువగా ఇంటర్, డిగ్రీ, పీజీ పిల్లలు ఉండటంతో కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం చేయాలని, వారికి నాణ్యమైన ఆహారం అందించాలని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ (Collector) సూచించారు.
బస్తీ దవాఖాన సందర్శన..
చివరగా, బస్తీ దవాఖానను సందర్శించి, బస్తీ వాసులకు అందిస్తున్న వైద్య సేవల గురించి, ఓపీ వివరాలను మెడికల్ ఆఫీసర్‌ను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి, మందుల కొరత లేకుండా చూడాలని వైద్యాధికారిని సూచించారు. ఈ తనిఖీలో (Collector) కలెక్టర్‌తో పాటు జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు, సీడీపీఓ రేణుక, వార్డెన్ చిరంజీవి, ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సాజిద్, డాక్టర్ కార్తీక్, సూపర్ వైజర్ రమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
(అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు వడ్డిస్తున్న ఎగ్ బిర్యానీని రుచి చూస్తున్న కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు)
Also Read: MP Dharmapuri Arvind: అభద్రతా భావం ఉంటే అమెరికా వెళ్లిపో.. నా ఫోన్ ట్యాప్ ఎందుకు చేశావ్!