MP Dharmapuri Arvind( image credit: swetcha reporter)
Politics

MP Dharmapuri Arvind: అభద్రతా భావం ఉంటే అమెరికా వెళ్లిపో.. నా ఫోన్ ట్యాప్ ఎందుకు చేశావ్!

MP Dharmapuri Arvind: మాజీ మంత్రి (KTR) కేటీఆర్‌పై నిజామాబాద్ (NIZAMABAD)  ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్ (KTR) చిల్లర వ్యక్తి అని, తన ఫోన్ ట్యాప్ (Phone Typping) ఎందుకు చేశారంటూ ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. (KTR) కేటీఆర్‌కు పని పాట లేదని మండిపడ్డారు. ఆయనకు అభద్రతాభావం ఉంటే అమెరికా వెళ్లిపోవాలని సూచించారు. కల్వకుంట్ల కుటుంబం (Kalwakuntla Family)  మొత్తం అభద్రతా భావంలోనే ఉంటుందన్నారు.

Also Read: CM Revanth Reddy: డిజిటల్ యుగంగా ప్రపంచం.. నైపుణ్యాల పెంపునకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు!

అరవింద్ ఆగ్రహం

టీఎన్జీవోలకు భూమి కేటాయింపులో రిజిస్ట్రేషన్ కోసం 10 ఎకరాలు అడిగిన వ్యక్తి కేటీఆర్ (KTR)  అని అరవింద్ (Dharmapuri Arvind) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోన్ స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకింగ్ జరుగుతోందని యాపిల్ కంపెనీ తనకు పలుమార్లు అలర్ట్ మెసేజ్‌లు పెట్టిందని తెలిపారు. ఆ తర్వాత తాము ప్రికాషన్స్ తీసుకున్నట్లు చెప్పారు. వాట్సప్, ఫేస్ టైంలో తాము మాట్లాడుతున్నప్పుడు ట్యాపింగ్ జరుగుతుందని చెబితే తాను ఆ కాల్ కట్ చేసి నార్మల్ కాల్‌లో కేసీఆర్,(KCR)) కేటీఆర్, (KTR) కవిత (Kavitha)  గురించి ఓపెన్‌గా విమర్శలు చేశానని అన్నారు. ట్యాప్ చేసుంటే వారు విని ఉంటారని, వింటే వారి చెవిలో నుంచి రక్తాలు కారుతాయని సెటైర్లు వేశారు.

  సిట్‌పై నమ్మకం లేదు

ట్యాపింగ్ విషయంలో తనను ఏ సిట్, ఏ స్టాండ్ పిలవలేదని ఎద్దేవా చేశారు. తనకు  ‌సిట్‌పై నమ్మకం లేదని వెల్లడించారు. రేవంత్ ( Revanth Reddy) చేస్తున్న దర్యాప్తులు కేవలం కేసీఆర్, (KCR) కేటీఆర్ (KTR)  నుంచి డబ్బులు తీసుకుని పోవడానికే ఇలా చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన వారికే ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)  టికెట్లు ఇచ్చారని అరవింద్ (Dharmapuri Arvind) ఆరోపించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తన 3 నెంబర్లు కూడా ట్యాప్ అయ్యాయని వెల్లడించారు.

 Also Read: Local Body Election: లోకల్ బాడీ ఎన్నికల్లో.. పట్టు కోసం పార్టీలు తాపత్రయం!

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?