Hyderabad Collector ( iMAGE CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Hyderabad Collector: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన.. జిల్లా కలెక్టర్ హరిచందన

Hyderabad Collector: విద్యార్ధులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Harichandan Dasari) ఉపాధ్యాయులకు సూచించారు.  నాంపల్లి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, విద్యార్ధులకు నాణ్యమైన విద్యాబోధన అందాలని సూచించారు. పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్ధులకు ఆహారాన్ని అందించాలని, డిజిటల్ విద్యాబోధనకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ద్వారా విద్యాబోధన అందించి నూరు శాతం ఉత్తీర్ణత ఉండేలా చూడాలన్నారు.

 Also Read: Minister Adluri Laxman: పాలకుర్తి అభివృద్ధికి కృషి చేస్తా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ

క్రీడల్లో రాణించేలా ప్రత్యేక తర్ఫీదునివ్వాలి

విద్యార్థులకు విద్యతో పాటు వివిధ క్రీడల్లో రాణించేలా ప్రత్యేక తర్ఫీదునివ్వాలని సూచించారు. ఆ తర్వాత తరగతి గదులను పరిశీలించి విద్యార్ధులకు అందుతున్న విద్యా బోధన తీరును పరిశీలించారు. ఎఫ్ఆర్ఎస్ తీరుపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న మెనూ విధానం, గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం తదితర అంశాలపై ఉపాధ్యాయులు కలెక్టర్ కు వివరించారు.ఆ తర్వాత పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్శనలో కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి, డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, స్కూల్ హెడ్ మాస్టర్ ఎం హాబీబా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Red Sea cable cut: ఎర్ర సముద్రంలో కేబుల్స్ కటింగ్.. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం!

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్