Cyber Crime(image credit:X)
హైదరాబాద్

Cyber Crime: ఇన్వెస్ట్​ మెంట్​ పేరుతోఫ్రాడ్​.. ఏకంగా 2.44 కోట్ల మోసం!

Cyber Crime: పెట్టుబడులపై భారీగా లాభాలంటూ ఎర వేసి 2.44 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన క్రిమినల్స్ కు బ్యాంక్​ అకౌంట్లు సమకూర్చిన వ్యక్తిని హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులు అరెస్ట్​ చేశారు. సైబర్​ క్రైం డీసీపీ డీ.కవిత తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్​ కు చెందిన 56 సంవత్సరాల వ్యాపారి ఇటీవల సోషల్​ మీడియా యాప్స్​ ను బ్రౌజ్ చేస్తుండగా సామ్​ కో సెక్యూరిటీస్​, ఐఎఫ్​ఎల్​ అప్లికేషన్లు కనిపించాయి.

తమ అప్లికేషన్లు డౌన్​ లోడ్​ చేసుకుని పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలను సొంతం చేసుకోండి అని కనిపించటంతో బాధితుడు వాటిని డౌన్​ లోడ్ చేసుకున్నాడు. మొదట్లో ఈ అప్లికేషన్ల ద్వారా చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడులుగా పెట్టాడు. ఈ క్రమంలో సైబర్​ క్రిమినల్స్​ అతనికి మీరు పెట్టిన పెట్టుబడులపై లాభాలు వచ్చాయంటూ ఆన్​ లైన్​ ద్వారా తెలిపారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుబడులతోపాటు లాభాలను ఆన్​ లైన్​ ద్వారానే విత్​ డ్రా చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ప్రతీ విత్​ డ్రాకు 6శాతం పన్ను కట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఇది నమ్మిన సదరు వ్యాపారి వేర్వేరు విడతల్లో మొత్తం 2.44 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టాడు. ఆ తరువాత డబ్బును విత్​ డ్రా చేసుకోవటానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దాంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also read: Chennai Updates: చెన్నైలో అపరిచితుడు.. రియల్ హీరో అంటున్న నగర వాసులు..

ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ ప్రమోద్​ కుమార్, ఎస్సై షేక్​ అజీజ్​ తోపాటు కానిస్టేబుళ్లు పరుశురాం, విజయ్ కుమార్​, అశ్విన్​ కుమార్​, వేణుగోపాల్​, శ్రీనివాస్​, రామాంజనేయ ప్రసాద్​ లతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. నవీ ముంబయికి చెందిన రష్మిత్​ రాజేంద్ర పాటిల్​ కు చెందిన బ్యాంక్​ అకౌంట్లలో డబ్బు జమ అయినట్టు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో సైబర్​ క్రిమినల్స్​ కమీషన్​ ఇస్తామని చెప్పి అతని అకౌంట్లను ఉపయోగించుకున్నట్టుగా వెల్లడైంది.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ