Chennai Updates: అపరిచితుడు సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో ఓ కరెంట్ తీగ తెగి నీటిలో పడుతుంది. అప్పుడే పాఠశాల నుండి వచ్చే విద్యార్థులు, ఓ కుటుంబం విద్యుత్ షాక్ తో మృతి చెందడం మనం ఆ సినిమాలో చూసి ఉంటాం. అయితే అది సినిమా కాబట్టి మనం కూడా ఈజీగా తీసుకుంటాం. సేమ్ టు సేమ్ అలాంటి సీన్ చెన్నై లో జరిగింది. కానీ ఇక్కడ కాపాడేందుకు అపరిచితుడు వచ్చాడు. అలా కాపాడాడు. ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
చెన్నై అరంబాక్కంలో స్కూల్ నుండి ఓ విద్యార్థి ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయాన వర్షం పడి ఉండడంతో రహదారిలో వర్షపు నీరు నిలిచింది. అయితే ఆ విద్యార్థి జాగ్రత్తగా వెళుతూ ఉన్నాడు. కానీ అదే సమయాన ఓ విద్యుత్ తీగ ఆ నీటిలో ఉంది. ఆ తీగ ఏదో కాదు, విద్యుత్ తీగ ప్రసారం అవుతున్న తీగ. ఆ విద్యార్థి తన ఇంటికి వెళ్లాలన్న ఆనందంతో వెళుతూ ఉన్నాడు. అంతలోనే కరెంట్ షాక్ కు గురై అలాగే పడిపోయాడు.
నీటిలో విద్యుత్ తీగ ఉండడంతో ఆ విద్యార్థికి విద్యుత్ షాక్ తగిలింది. ఇంకేముంది ఆ విద్యార్థి నీటిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అంతలోనే ఓ బైకర్ అటువైపుగా వచ్చాడు. ఏదో జరిగింది తనకెందుకులే అనుకోలేదు ఆ వ్యక్తి. వెంటనే బైక్ అపాడు. కరెంటు తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. స్థానికులను కర్ర ఉందా అంటూ అడిగాడు. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకేముంది ఓ వైపు ఆ విద్యార్థి తుది శ్వాసతో కొట్టుమిట్టాడుతూ, చావుకు దగ్గరలో ఉన్నాడు.
Smiley Moon: 25న ఆకాశంలో మరో అద్భుతం.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఎప్పుడో!
ఇక చేసేదేమిలేక ఆ వ్యక్తి వెంటనే ఓ వైపుగా బాలుడి వద్దకు చేరుకొని, చిన్నగా పట్టి గుంజాడు. అలా గుంజి వెంటనే వైద్యశాలకు తరలించాడు. తన ప్రాణం పోతుందన్న భయం లేదు కానీ, ఎలాగైనా ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడాలన్నదే ఆ వ్యక్తి లక్ష్యం. ఎట్టకేలకు అనుకున్నట్లుగానే ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. దారి వెంట పోతూ తనకెందుకులే అంటూ అనుకోకుండా, విద్యార్థి ప్రాణాలు కాపాడిన సదరు వ్యక్తిని చెన్నై వాసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇంతకు ఆ వ్యక్తి పేరు ఏమిటో తెలుసా.. అతనే కణ్ణన్. యావత్ తమిళనాట ఇప్పుడు కణ్ణన్ పేరు మారుమ్రోగుతోంది. అపరిచితుడు వచ్చాడు.. ఇలా తమ అబ్బాయిని కాపాడాడు అంటూ ఆ విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై :
అరంబాక్కంలో స్కూల్ నుండి ఇంటికి వెలుతున్న సమయంలో రోడ్డుమీదా నిలిచిన వర్షపు నీటిలో నడుస్తుండగా కరెంటు తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుడు
కరెంట్ షాక్ తో నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని ధైర్యంగా రక్షించిన యువకుడు కన్నన్.
అటువైపు వెళుతున్న వారు ఎవరూ… pic.twitter.com/7K07bL3jCU
— Telangana Awaaz (@telanganaawaaz) April 20, 2025