Smiley Moon ( Image Source: Twitter)
Viral

Smiley Moon: 25న ఆకాశంలో మరో అద్భుతం.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఎప్పుడో!

Smiley Moon: ఆకాశంలో అపుడప్పుడు అద్భుతాలు చోటు చేసుకుంటాయి. అయితే, ఏడాది ఏప్రిల్ 25 మనం ఎన్నడూ చూడని ఒక వింత దృశ్యాన్ని చూడబోతున్నాం. రోజున ఉదయం సూర్యాస్తమయానికి ముందు మాత్రమే ఖగోళ అద్భుతాన్ని చూడొచ్చని నాసా పేర్కొంది. నెల 25 ఉదయం ఒకసారి బయటకు వచ్చి ఆకాశం వంక దృష్టి సారించండి. ఒకే సమయంలో మూడు గ్రహాలు మనల్ని పలకరించనున్నాయి. శుక్రుడు, శని గ్రహాలు చంద్రుడికి దగ్గరగా వెళ్లనున్నాయి. దీంతో, ఆకాశంలో త్రిభుజాకారంలో ఒక చిరునవ్వు ముఖంలా కనిపిస్తాయి.

దీనిలో శుక్రుడు చాలా ప్రకాశవంతమైన “కన్ను” తో కనిపిస్తాడు. శని గ్రహం మసకబారిన “కన్ను” తో కనిపిస్తాడు. ఇక చంద్రవంక చంద్రుడు “చిరునవ్వు” వలే ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని

మనం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో చూడొచ్చు. ఉదయం 4:45 నుండి ఉదయం 6:15 గంటల మధ్యలో చూడొచ్చు. మీరు మంచిగా చూడాలనుకుంటే ఉదయాన్నే నిద్రలేచి ఉదయం 5:00 గంటలకు వెళ్ళండి.

Also Read: Subbareddy on Vijayasai Reddy: విజయసాయిరెడ్డిపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్.. గట్టిగా ఇచ్చి పడేశారుగా!

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ చూడొచ్చంటే?

హైదరాబాద్:  హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, గండిపేట సరస్సు, షామిర్‌పేట వద్ద చూడొచ్చు.

విజయవాడ:  విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ప్రాంతం, భవానీ ఐలాండ్, కొండపల్లి అటవీ ప్రదేశాలు వద్ద అద్భుతాన్ని చూడొచ్చు.

విశాఖపట్నం:  విశాఖపట్నంలో ఆర్‌కె బీచ్ లేదా డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ వద్ద చూడొచ్చు.

వరంగల్ :  వరంగల్ లో పాఖల్ సరస్సు లేదా భద్రకాళి ఆలయ ప్రాంతం వద్ద చూడొచ్చు.

తిరుపతి:  తిరుపతిలో కొండ వ్యూ పాయింట్‌లలో లేదా చంద్రగిరి కోట సమీపంలో దృశ్యాన్ని చూడొచ్చు.

Also Read: Hyderabad Alert: నీటి కోసం అలా చేస్తున్నారా.. డేంజర్ లో పడ్డట్లే.. అధికారులు వార్నింగ్!

దృశ్యాన్ని చూసేందుకు చిట్కాలు ఇవే

1. గ్రహాలను చూడటానికి స్కైసఫారి, స్టార్ వాక్ 2 లేదా స్టెల్లారియం వంటి స్కై యాప్‌ను ఉపయోగించండి.

2. బైనాక్యులర్లు స్పష్టతకు సహాయపడతాయి, ఇది కళ్ళతో సులభంగా కనిపిస్తుంది.

3. మీరు ఆస్ట్రోఫోటోగ్రఫీలో ఉంటే, అరుదైన ఖగోళ చిరునవ్వును చూడటానికి ఇదే మంచి అవకాశం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు