Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై 28 ఏళ్ల యువతి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ లో నివాసం ఉండే ఓ యువతి… తన ఇంటి పక్కన ఉండే బాలుడితో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత తన ఇంటికి పిలిచిన ఆమె.. బాలుడిని మాయ మాటలు చెప్పి లోబరుచుకుంది.
అలా పలుమార్లు తన ఇంట్లోనే మైనర్‌పై ఆమె లైంగికదాడికి పాల్పడింది. ఈ విషయం బయటకు చెబితే తనపై అత్యాచారం చేశావని చెబుతానంటూ బాలుడిని బెదిరించింది. దాంతో భయపడిపోయిన బాలుడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. తాజాగా మరోసారి అతనిపై లైంగిక దాడికి పాల్పడిందామె. అలాగే అసభ్యకరమైన పనులు చేయాలంటూ బాలుడిని బలవంతం చేసింది.
Also Read: Vishaka Double Murder Case: జంట హత్యల కేసులో సంచలన నిజాలు.. ఇంటర్నేషనల్ క్రిమినల్ అరెస్ట్
రోజురోజుకూ ఆమె వేధింపులు ఎక్కువ కావడంతో మైనర్ బాలుడు భరించలేకపోయాడు. తనపై గతకొంతకాలంగా యువతి చేస్తున్న దారుణాన్ని పేరెంట్స్‌కు చెప్పాడు. దాంతో బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత బాలుడి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు యువతిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.