Hyderabad Collector: గాంధీ జయంతి ఏర్పాట్లను మరింత స్పీడప్ చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ (Hyderabad Collector) హరిచందన (Harichandana) దాసరి అధికారులను ఆదేశించారు. మంగళవారం బాపు ఘాట్ లోని పలు ప్రాంతాలను పరిశీలించి తదుపరి బాపూ మ్యూజియం హాల్లో ఏర్పాట్లపై చేపట్టిన సమావేశంలో అదనపు కలెక్టర్ జి. ముకుంద రెడ్డి తో కలిసి ఆమె ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా కేటాయించిన పనులను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు.
Also Read: Pre Wedding Show: మొన్న ‘వైరల్ వయ్యారి’.. ఇప్పుడు ‘వయ్యారి వయ్యారి’.. మరో క్యాచీ లవ్ సాంగ్
పనుల ఏర్పాటు పై అధికారులకు దిశా నిర్దేశం
అంతకుముందు బాపు ఘాట్ ను సందర్శించి పనుల ఏర్పాటు పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వచ్చేనెల అక్టోబర్ 2 వ తేదీన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు బాపు ఘాట్ మ్యూజియం సందర్శించనున్నట్లు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ, విద్యా శాఖ, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, సమాచార శాఖ, ఉద్యానవన శాఖ, ఫైర్ , పోలీస్, పర్యాటకశాఖ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై ఆమె సమీక్షించారు. ఈ సందర్శనలో ఆర్డీవో రామకృష్ణారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ అహల్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Tilak Varma: హైదరాబాద్‌లో తిలక్ వర్మ సందడి.. పాక్‌పై ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌పై.. ఆసక్తికర వ్యాఖ్యలు