Pre Wedding Show: రీసెంట్‌గా వచ్చిన ‘జూనియర్’ (Junior Movie) సినిమాలోని ‘వైరల్ వయ్యారి’ సాంగ్.. ఎలా వైరల్ అయ్యిందో తెలియంది కాదు. ఇందులో శ్రీలీల, కిరీటీల డ్యాన్స్ హైలెట్ అవడంతో, పాట కూడా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ పాట చాలా చోట్ల వినబడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడే ‘వయ్యారి’తో మరో సాంగ్ కూడా వచ్చి, వైరల్ అవుతుంది. వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ (Thiruveer), టీనా శ్రావ్య (Teena Sravya) జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’ (Pre Wedding Show). ఈ మూవీని బై 7PM, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇటీవల వచ్చిన టీజర్.. సినిమాపై క్రేజ్ పెంచిన నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘వయ్యారి వయ్యారి’ (Vayyari Vayyari Lyrical Video) అంటూ సాగే క్యాచీ లవ్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
Also Read- Mahakali: ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ ‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా ఎవరంటే?
ఈ సాంగ్ విషయానికి వస్తే..
‘ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్‌లో వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్‌గా తిరువీర్ కనిపించిన విషయం తెలిసిందే. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ చుట్టూ ఓ ప్రేమ కథ, ఓ వింత సమస్య, దాన్నుంచి జెనరేట్ అయ్యే కామెడీ అందరినీ ఆకట్టుకోగా.. ఇప్పుడు వచ్చిన వచ్చిన ‘వయ్యారి వయ్యారి’ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ పాటకు సనారే సాహిత్యం అందించారు. అందరికీ అర్థమయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ సాహిత్యం ఉండగా.. యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. సురేష్ బొబ్బిలి స్వరపరిచిన స్వరాలు వినసొంపుగా, వినగానే ఎక్కేసేలా ఉన్నాయి. అలాగే ‘వయ్యారి వయ్యారి’ లిరికల్ వీడియో చూస్తుంటే.. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- Mega OG Pic: ‘మెగా ఓజీ పిక్’.. పవన్ సినిమాపై చిరు రివ్యూ అదిరింది
క్రేజ్, స్టేటస్ పక్కా..
హీరో తిరువీర్ చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ, ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని కనబరుస్తూ.. నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ సినిమాతో ఆయనకు మంచి క్రేజ్, స్టేటస్ వస్తుందని భావిస్తున్నారు. టీజర్ చూస్తుంటే, చాలా వరకు అది నిజమే అనిపిస్తుంది. వన్ మ్యాన్ షోలా ఈ సినిమా తిరువీర్‌కు నిలుస్తుందని, మంచి సక్సెస్ ఆయన ఖాతాలో పడేలా చేస్తుందని మేకర్స్ కూడా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. నవంబర్ 7న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, ప్రేక్షకులందరికీ సరికొత్త ఫీల్‌ని ఇస్తుందని మేకర్స్ వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు