GHMC ( image credit: Twitter)
హైదరాబాద్

GHMC: శానిటేషన్ పనులపై రాంకీ నిర్లక్ష్యం.. జరిమానాలు విధిస్తున్నా మారని తీరు!

GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శానిటేషన్ పనులకు సంబంధించి రాంకీ సంస్థ జీహెచ్ఎంసీతో చేసుకున్న అగ్రిమెంట్ లోని అంశాలకు అనుకూలంగా పని చేయటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలించే పనులకు సంబంధించి రాంకీ 2009లో జీహెచ్ఎంసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెత్త సేకరణ, యార్డుకు తరలింపు, యార్డులో సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయటం లేదన్న విషయాన్ని గుర్తించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇటీవలే రాంకీకి జరిమానా విధించింది. అంతకు ముందు గ్రేటర్ పరిధిలో ఎక్కువ చెత్త జమ అయ్యే వల్నరబుల్ పాయింట్ల లోని చెత్తను రాంకీ సకాలంలో తరలించటం లేదన్న విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు రాంకీకి రూ. లక్ష జరిమానా కూడా విధించారు.

Also Read: GHMC: మెడికల్ ఆఫీసర్ల అక్రమాలకు చెక్.. బల్దియాలో కీలక సంస్కరణలకు కమిషనర్ సిద్ధం

రూ.100 కోట్లను జీహెచ్ఎంసీ

ఈ రకంగా రాంకీకి వరుసగా జరిమానాలు విధిస్తున్నా, అసలు పని తీరు ఏ మాత్రం మారటం లేదన్న వాదనలున్నాయి. వల్నరబుల్ గ్యార్బేజీ పాయింట్ (వీజీపీ)ల వద్ద సకాలంలో చెత్తను తరలించే బాధ్యతలను నిర్వహిస్తున్న రాంకీ సంస్థ పనితీరుపై కమిషనర్ ఆర్.వి. కర్జన్ స్పెషల్ ఫోకస్ చేశారు. రాంకీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెత్త సేకరణ, తరలింపునకు ఎంగేజ్ చేయాల్సిన వాహానాల సంఖ్యను కూడా ఎంచాలని కమిషనర్ రాంకీకి సూచించారు. ఇప్పటి వరకు రాంకీకి చెల్లించాల్సిన బకాయిల్లో భాగంగా ఇటీవలే రూ.100 కోట్లను జీహెచ్ఎంసీ చెల్లించింది.

నిర్లక్ష్యాన్ని వహిస్తే మాత్రం ఇక సహించేది లేదు

అప్పటినుంచి రాంకీ పని తీరుపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడ ఎలాంటి లోపం జరిగినా భారీగా జరిమానాలు విధించాలని కమిషనర్ ఆర్.వి.కర్ణన్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు. చెత్త తరలింపు విషయంలో నిర్లక్ష్యాన్ని వహిస్తే మాత్రం ఇక సహించేది లేదని కమిషనర్ కూడా రాంకీ సంస్థకు సూచించారు. అయినప్పటకీ మార్పు రాకపోవడంతో ఈ సారి ఎన్ జీటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ విషయంలో రాంకీ సంస్థతో పాటుగా జీహెచ్ఎంసీకి సైతం జరిమానా విధించింది. అగ్రిమెంట్ లో పేర్కొన్న నిబంధనల ప్రకారం రాంకీ చెత్త సేకరణ, సైంటిఫిక్ డిస్పోజ్ చేయకపోవటం వల్లే ఎన్ జీటీ తమకు జరిమానా విధించిందని జీహెచ్ఎంసీ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపై రాంకీ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

వరుసగా నోటీసులు హెచ్చరికలు

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చెత్త తరలింపు విషయంలో రాంకీ సంస్థపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సకాలంలో చెత్త తరలింపును నిర్లక్ష్యం చేస్తుందంటూ జీహెచ్ఎంసీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రోజువారీ తనిఖీలలో అలీజాపూర్ రోడ్ వద్ద భారీ ఎత్తున చెత్త పేరుకుపోవటాన్ని గమనించిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ఏజెన్సీపై రూ.1 లక్ష జరిమానా విధించారు. సుమారు 200 మీటర్ల మేర చెత్త పేరుకు పోవడంతో ప్రజలకు ఇబ్బందులు, ఇబ్బందికర అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక సార్లు సూచనలు చేసినప్పటికీ, ఏజెన్సీ స్పందించక పోవడంతో జోనల్ కమిషనర్ జరిమానా విధించారు.

వ్యర్ధాల తొలగింపు విషయంలో నిర్లక్ష్యం

అంతకు నెల రోజుల ముందు నగరంలో పేరుకుపోతోన్న చెత్తతో పాటుగా, భవన నిర్మాణ వ్యర్ధాల తొలగింపు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందున జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్జన్ ఒక్కరోజే వివిధ పేర్లతో పనులు చేస్తున్న ఒకే సంస్థకు రెండు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలు హైదరాబాద్ సీ అండ్ డీ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ (రాంకీ ఏజెన్సీ) సకాలంలో తొలగించకపోవడం పట్ల నోటీసు జారీ చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయి అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, డీఈఈ ల పదే పదే విజ్ఞప్తుల తర్వాత కూడా వ్యర్థాల తొలగింపు పనులు తిరిగి ప్రారంభించకపోవడంతో వారిపై కూడా కమిషనర్ కర్ణన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.

నిర్లక్ష్యంపై అధికారులు నోటీసులు

ఇదే విధంగా గత జూన్ 25. జూలై 30 తేదీల్లో కూడా ఇలాంటి నిర్లక్ష్యంపై అధికారులు నోటీసులు జారీ చేసినా, రాంకీ సంస్థ పనితీరులో మార్పు రాకపోవటం గమనార్హం. రాంకీ ఏజెన్సీ తక్షణమే స్పందించి. వాహనాలతో పేరుకుపోయిన సీ అండ్ డీ వ్యర్థాలను తొలగించకపోతే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కమిషనర్ హెచ్చరించారు. అవసరమైతే క్లాజ్ 7.4 మేరకు ఒప్పందం రద్దు చేయడం, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిశుభ్రత తమకు ప్రధానమని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

Also ReadGHMC: ఫుటోవర్ బ్రిడ్జిలపై అధ్యయనం.. స్టడీ చేసి నివేదికలను సమర్పించాలని ఆదేశం

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!