Hyderabad City (imagecredit:swetcha)
హైదరాబాద్

Hyderabad City: ట్రాన్స్ జెండర్లకు రూ. 290 కోట్ల ఆస్తుల పంపిణీ.. దాని కోసమేనా!

Hyderabad City: సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దుతామని జీహెచ్ఎంసీ(GHMC) మేయర్ విజయలక్ష్మి(Vijayalaxmi), కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karana) వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మేయర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తో కలిసి మేయర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె తన స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో నగరాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న పథకాలను భవిష్యత్ ప్రణాళికలను మేయర్ వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జవహర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న 24 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్(Waste to Energy Plant), 300 టన్నుల సామర్థ్యం గల బయో-మెథనేషన్ ప్లాంట్ లను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్

నగర వ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్ లలో ఉదయం పూట కేవలం రూ.5 లకే మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పొంగల్, పూరీ అందించే స్కీమ్ ను త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల జారీకి ఇకపై కేంద్ర రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయానికి చెందిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్ ) పోర్టల్ ద్వారా జారీ చేయనున్నట్లు తెలిపారు. మై జీహెచ్ఎంసీ యా(GHMC App)ప్ ద్వారా శానిటేషన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చామని, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పికప్ బుకింగ్ ను పౌరులకు అందిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ ఆస్తులకు జీఐఎస్(GIS) మ్యాపింగ్ చేసి, వాటి సమర్థ నిర్వహణకు చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ డిజిటల్ పోర్టల్, యూపీఐ(UPI) విధానం ద్వారా ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నామని, నగరానికి వరద ముప్పును తప్పించేందుకు ఆధునిక జీఐఎస్ సాంకేతికతతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల సర్వే, మ్యాపింగ్ చేపట్టాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.

Also Read: Naga Vamsi: మరోసారి వివాదంలో చిక్కుకున్న నిర్మాత.. మంత్రి కారులో ఏంపని?

ఆ పనులు టెండర్ పక్రియ

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో నగరంలో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు రాష్ట ప్రభుత్వం హెచ్-సిటీ ద్వారా రూ. 7032 కోట్ల వ్యయంతో 47 ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, 10 రోడ్డు విస్తరణ పనులతో కలిపి 38 ప్రధాన ప్రాజెక్ట్ లు చేపడుతున్నామని, ఆ పనులు టెండర్ పక్రియ పూర్తి చేసుకున్నట్లు, వీటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ గతంలో ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన 42 పనులలో 37 పనులు పూర్తి చేశామని, మిగతా 5 పనులను వచ్చే సంవత్సరం సంవత్సరంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. నగరంలో రోడ్ల అభివృద్ధికి జీహెచ్ఎంసి పెద్ద పీట వేసిందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3806 రోడ్డు పనులు రూ.1046.91 కోట్ల వ్యయంతో చేపట్టగా, అందులో 1680 రోడ్డు పనులు రూ.485.05 ఖర్చుతో పూర్తి చేశామని వెల్లడించారు.

బ్యూటిఫికేషన్ పనులతో పాటు

వర్షాకాలంలోై వర్షపు నీరు నిల్వకుండా నివారణ చర్యల్లో భాగంగా వినూత్నంగా వాటర్ లాగింగ్ పాయింట్ల నిర్మాణం చేసి వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు ఒక లక్ష లీటర్ల కెపాసిటీ నుండి 10 లక్షల కెపాసిటీ సామర్థ్యంతో భూగర్భ సంప్ ల నిర్మాణాలు రూ. 14 కోట్ల వ్యయంతో 11 పనులు చేపట్టగా, అందులో 10 పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ ఇమేజ్ ను పెంచడానికి బ్యూటిఫికేషన్ పనులతో పాటు ఫ్లైఓవర్లు, జంక్షన్ల వంటి ప్రధాన నిర్మాణాల సౌందర్య మెరుగుదల అవసరమైన సుందరీకరణ పనులు చేపడుతున్నామని, కళాత్మక పెయింటింగ్స్, ఇన్ స్టాలేషన్ చేపట్టడం వంటి నిర్వహించామన్నారు.

Also Read; Bhatti Vikramarka: ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?