Batti Vikramarka
ఖమ్మం, తెలంగాణ

Bhatti Vikramarka: ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు

Bhatti Vikramarka:

ఓటరు జాబితా అడిగితే రాహుల్ గాంధీపై కేసులు

దేశంలో బీజేపీ నియంత పాలన
ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన భట్టి విక్రమార్క

ఖమ్మం, స్వేచ్ఛ: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించినందుకు ఆయనపై కేసులు పెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (hatti Vikramarka) అన్నారు. ప్రజలకు ఓటరు జాబితా సాఫ్ట్ కాపీ అందుబాటులో ఉంచాలని అడిగినందుకు రాహుల్ గాంధీపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నారని, అందుకు నిరసనగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏఐసీసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు ఆయన వివరించారు.

Read Also- TS EDCET: ఎడ్ సెట్ సెల్ఫ్ రిపోర్టింగ్‌పై గుడ్‌న్యూస్

బతికి ఉన్నవారిని చనిపోయినట్లుగా, ఉన్న ఓటర్లను లేనట్లుగా చూపిన ఓటరు లిస్ట్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని, దానికే కేసు పెట్టారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ వ్యవహారం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వాస్తవాలు వివరించేందుకు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే ఓటు హక్కును కాపాడుకోవడమే, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అని ఆయన వ్యాఖ్యానించారు. నేడు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కూటమి ఏదో రకంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచి నియంత పాలన ఈ దేశంలో తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలన తీరు ప్రజాస్వామ్యంపై దాడి అని అభివర్ణించారు.

Read Also- Crime News: బస్సులో పరిచయం.. చేపలు ఇస్తానంటూ మహిళను కిందకు దింపి..

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన, రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీకి లొంగిపోయి వాస్తవాలు బయటపెట్టడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ దేశంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు పుచ్చకాయల వీరభద్రం, బేబీ స్వర్ణకుమారి, దొబ్బల సౌజన్య, ఆర్టీఏ సభ్యుడు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి పార్టీ నేతలు కొవ్వొత్తులతో జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు.

Read Also- HYDRA: కీలక ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటన.. ఎందుకంటే?

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?