GHMC Internal Changes: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మహానగరాభివృద్దితో పాటు నగరవాసులకు ముఖ్యమైన పౌర సేవలందించే జీహెచ్ఎంసీ( GHMC) లో త్వరలోనే అంతర్గతంగా మార్పులు జరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC) లో ఇప్పటికే అదనపు కమిషనర్ల సంఖ్య ఎక్కువైపోవటం, ఇంత మంది అవసరమా? అన్న ఆలోచన కమిషనర్ ఆర్. వి. కర్ణన్ (R.V. Karnan)కు రావటంతో త్వరలోనే అదనపు కమిషనర్ల సంఖ్య కుదించే అవకాశం లేకపోలేదన్న వాదనలున్నాయి.
జీహెచ్ఎంసీ గ్రేటర్ గా రూపాంతరం చెందిన తర్వాత స్టాఫ్ ప్యాటన్ కోసం అప్పట్లో సర్కారు నియమించిన ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్ఎంసీ( GHMC) లో ఆరుగురు అదనపు కమిషనర్లు ఉండాలి. కానీ కొద్ది రోజుల క్రితం వరకు అదనపు కమిషనర్ల సంఖ్య 14గా ఉండేది. గతంలో హెల్త్, శానిటేషన్ విభాగాలకు ఒకే అదనపు కమిషనర్ ఉండే వారు, కాలక్రమేనా న్యాన్ క్యాడర్ ఆఫీసర్లను జీహెచ్ఎంసీలో అకామిడెట్ చేసేందుకు హెల్త్, శానిటేషన్ విభాగాలను విడదీసి, ఇద్దరు నాన్ క్యాడర్ ఆఫీసర్లకు అదనపు కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించారు.
Also Read: Maoist Leader Killed: చత్తీస్గడ్ బీజాపూర్ లో.. భారీ ఎన్కౌంటర్!
ఈ రకంగా ప్రసాదరావు కమిటీ సిఫార్సుల ప్రకారం ఆరు కు పరిమితం కావల్సిన అదనపు కమిషనర్ల సంఖ్య 12కు తగ్గింది. ఆర్. వి. కర్ణన్ (R.V. Karnan) కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కర్ణన్ కన్నా ఒక సంవత్సరం సీనియర్ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ విధులకు రావటమే మానేశారు. జీహెచ్ఎంసీ నుంచి బయటకు బదిలీ చేయించుకునే ప్రయత్నంలో సదరు అధికారి ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత మరో నాన్ క్యాడర్ అధికారి అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయ్యారు.
అదనపు కమిషనర్ల సంఖ్య తగ్గితే..
జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్ల సంఖ్య ఒక్కసారిగా 12 కు తగ్గినా, ఇంకా తగ్గితే జీహెచ్ఎంసీకి ఆర్థిక భారం తగ్గుతుందన్న అభిప్రాయాలున్నాయి. ఇటీవల నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బల్దియా కమిషనర్ ఆర్. వి. కర్ణన్ సైతం అదనపు కమిషనర్ల సంఖ్యపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదనపు కమిషనర్ల కుదింపునకు సంబంధించి కమిషనర్ ఓ సీనియర్ అధికారితో చర్చించినట్లు తెలిసింది.
ఒక్కో అదనపు కమిషనర్ కు స్పెషల్ చాంబర్, వెహికల్ తో పాటు కింది స్థాయి సిబ్బంది కేటాయించటంతో వీరి వల్ల జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం పడుతున్నందున ప్రసాదరావు కమిటీ సిఫార్సుల ప్రకారం దశల వారీగా వీరి సంఖ్యను ఆరుకు కుదించాలని కమిషనర్ ఇదివరు భావించగా, ఇపుడు జీహెచ్ఎంసీ (GHMC) లోని ఐఏఎస్ ఆఫీసర్లకు బదిలీలైన తర్వాత కుదింపు ప్రక్రియపై కమిషనర్ దృష్టి సారించనున్నట్లు తెలిసింది. సర్కారు ఇటీవలే ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్లకు స్థానచలనం కల్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో త్వరలోనే ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు కూడా చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
ఈ బదిలీల కోసం జీహెచ్ఎంసీ(GHMC) లోని నలుగురు ఐఏెఎస్ ఆఫీసర్లు ఎదురుచూస్తున్నారు. అదనపు కమిషనర్లుగా, జోనల్ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లాలకు కలెక్టర్ గా విధులు నిర్వహించాలని భావిస్తూ, బదిలీలను కోరుకుంటున్నట్లు తెలిసింది. బదిలీల కోసం కొందరు అధికారులు ఇప్పటికే సచివాలయ స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటుండగా, మరి కొందరు జోనల్ కమిషనర్లు తమ పరిధిలో తాము నిర్వహించాల్సిన విధులన్నంటినీ పక్కన బెట్టి బదిలీల కోసమే ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Also Read: Gender Reveal: స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి నిర్లక్ష్యంతో.. భార్య భర్తల ఆశలు అడియాశలు!
త్వరలోనే ఐఏఎస్ ల బదిలీలు?
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో రేపోమాపో ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీల ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. సర్కారు ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు చేపడితే, జాబితాలో జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ (GHMC) నుంచి నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు బయటకు వెళ్లే అవకాశాలుండగా, కేవలం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు జీహెచ్ఎంసీకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
ఆ తర్వాత కమిషనర్ ఆర్. వి. కర్ణన్ అంతర్గత బదిలీల ప్రక్రియ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. గతంలో మాదిరిగా ఒక్కో ఆఫీసర్ కు రెండు నుంచి మూడు విభాగాలను కేటాయించి, జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్ల సంఖ్యను తగ్గించాలని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో విభాగానికే పరిమితమైన పలువురు నాన్ క్యాడర్ ఆఫీసర్లకు రెండు నుంచి మూడు విభాగాల ను పర్యవేక్షించే బాధ్యతలను కర్ణన్ అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం.
Also Read: Kakani Arrest: అరెస్టులతో అభిమానాన్ని అడ్డుకోలేరు.. పూజిత వార్నింగ్