Gender Reveal: ఘోరం జరిగిపోయింది. మేల్ ఫిమేల్ కోసం స్కానింగ్ సెంటర్ కు వెళితే ఆ తల్లి కడుపులో ఉన్న శిశువు ఫిమేల్ అని తేల్చేశారు. ఇంకేముంది.. అప్పటికే ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు మరో కూతురు వద్దనుకొని నిశ్చయానికి వచ్చారు. ఇదే ఆ దంపతుల గ్రామంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వీరి సమస్యను ఆసరా చేసుకుని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఇద్దరు పోటీపడ్డారు. ఒకరు రెండు నెలల క్రితం స్కానింగ్ చేయిస్తే… మరో వ్యక్తి ఆ స్కానింగ్ రిపోర్టులో ఉన్న శిశువును తల్లి గర్భం నుంచి తొలగించి డబ్బులను చేజిక్కించుకోవాలనుకున్నాడు. ఈ తంతు తెలియని ఆ శిశువు తల్లిదండ్రులు ఏం చేయాలో పాలు పోక ఎవరు చెబితే వారి మాట వినేస్థితికి చేరిపోయారు.
అలా… ఓ ఆర్ ఎం పి డాక్టర్ ను ఆ తల్లిదండ్రులు కడుపులో పెరుగుతున్న శిశువును తొలగించుకునే విధంగా సంప్రదించారు. ఇదే అదునుగా భావించిన సదరు ఆర్ఎంపి వైద్యుడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లేడీ మెటర్నిటీ వైద్యురాలు వద్దకు సిఫారసు చేశాడు. అయితే అక్కడకు చేరుకున్న ఆ ఇద్దరు దంపతులు తమ సమీప బంధువుకు ఆపరేషన్ నిర్వహించిన మరో శాస్త్ర చికిత్స నిపుణులు వద్దకు వెళ్లారు.
Also Read: Complaints To Hydraa: నాలాల ఆక్రమణలపై ..హైడ్రాకు ఫిర్యాదులు!
ఆ సమయంలో సదర్ వైద్యుడు వైద్యశాలలో అందుబాటులో లేకున్నా ఆ తల్లికి కడుపులో ఉన్న శిశువు రూపంలో కడుపునొప్పి వస్తే అందుకు సంబంధించిన చికిత్సను ప్రారంభించింది. ఈ క్రమంలోనే సదరు ఆర్ఎంపి వైద్యుడు ఆ భార్య భర్తల కు ఫోన్ చేసి ఆసుపత్రికి వెళ్లారా…? అంటూ ఆరా తీశాడు. దీంతో ఆసుపత్రిలోనే ఉన్నామంటూ బదులిచ్చాడు. ఇదే విషయమై సదరు లేడీ మేటర్నిటీ వైద్యురాలకు సంబంధించిన వారి ద్వారా సమాచారాన్ని సేకరించాడు. అక్కడికి వెళ్లలేదని నిర్ణయించుకున్న ఆ ఆర్.ఎం.పి ఎక్కడికి వెళ్లారో… తెలుసుకున్నాడు. ఆ భార్యాభర్తలు వెళ్లిన శాస్త్ర చికిత్స నిపుణుడు వద్దకి వెళ్లి తాను పేషెంట్లను రెఫర్ చేశాను… నాకు రావాల్సిన కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది
శస్త్ర చికిత్స నిపుణుడు ఆర్ఎంపి వైద్యుడికి కమిషన్ ఇచ్చేది ఉంటే ఇక్కడ జరిగిన ఘటన సంచలనం కాకుండా, అదేవిధంగా గుర్తు సప్పుడు కాకుండా కడుపులో పెరుగుతున్న శిశువును అందరూ కలిసి చిదివేసేవారు. సమస్య సైతం సమస్య పోయేది. కానీ, స్కానింగ్ రిపోర్టులో ఏదైతే జరిగిందో… అంటే ఫిమేల్ అనే రిపోర్ట్ ఇస్తే అబార్షన్ తర్వాత మేల్ మృతి చెందడంతో అందరూ ఒకింత దుఃఖానికి లోనయ్యారు. అసలు స్కానింగ్ రిపోర్టులో ఫిమేల్ అని ఇచ్చిన లాగానే అబార్షన్ తర్వాత కూడా ఫిమేల్ అయి ఉంటే ఈ ఘటన ఇంత సంచలనం అయ్యేది కాదు.
కొడుకు కావాలని వేయికళ్లతో
ఆ గిరిజన దంపతులకు అప్పటికే ఇద్దరు కూతుర్లు కావడంతో కొడుకు కావాలని వేయి కళ్ళతో, కొండంత ఆశతో ఎదురు చూశారు. వారి ఆశకు దేవుడు కొడుకు రూపంలో శ్వాస పోసినప్పటికీ స్కానింగ్ నిర్వాహకుడి అలసత్వంతో ఆ శ్వాసకు శ్వాస లేకుండానే చేశాడు. ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఘటన. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బాబిలాల గ్రామ శివారు బోటి మీది తండాకు చెందిన గిరిజన దంపతులు ఒకరి సహాయంతో నెక్కొండ లోని పార్ధు ఆసుపత్రి నిర్వహకుడు బాలినే ఉపేందర్ వద్దకు స్కానింగ్ వెళ్లారు. స్కానింగ్ చేసిన అనంతరం కడుపులో పెరుగుతున్న శిశువు ఆడ శిశువుగా నిర్ధారించి చెప్పారు. కొంతకాలం గడిచింది.
Also Read: Harish Rao on Congress: ఇదేనా ప్రజాపాలన?.. హరీష్ రావు సంచలన కామెంట్స్!
ఆడ శిశువును గర్భం నుంచే తొలగించుకోవాలని కచ్చితంగా నిర్ణయానికి ఆ దంపతులు వచ్చారు. ఆ దంపతుల కు వచ్చిన సమస్యని ఆర్ఎంపి వైద్యుడు… మేటర్నిటీ వైద్యులు క్యాష్ చేసుకోవాలని ఓ ధరను నిర్ణయించుకున్నారు. కడుపులో పెరుగుతున్న ఆడ శిశువును చిదిమేసేందుకు 30 వేల రూపాయల ధరను ఖరారు చేసుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ అంతకుమునుపే సదరు గర్భిణీ కి అబార్షన్ జరగడానికి టాబ్లెట్లను వేశారు. దీంతో ఆ గర్భిణీకి కడుపు నొప్పి రావడంతో హుటాహుటిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లేడీ మేటర్నిటీ హాస్పిటల్ కి వెళ్లాల్సిన సదరు గర్భిణ శస్త్ర చికిత్స నిపుణుడు ఆస్పత్రికి వెళ్లారు.
తాను పంపించిన ఆసుపత్రికి వెళ్లలేదు కాబట్టి… అక్కడ తనకు కమిషన్ రాదు కాబట్టి… ఆర్ఎంపి వైద్యుడు చైల్డ్ లైన్ వెల్ఫేర్ బాధ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటి నా అక్కడికి చేరుకున్న చైల్డ్ లైన్ బాధ్యులు అబార్షన్ జరుగుతున్న గర్భిణీ పరిస్థితిని తెలుసుకొని అక్కడి నుంచి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అబార్షన్ జరిగిపోయినట్లుగా గుర్తించారు.
దీంతో రంగంలోకి దిగిన జిల్లా వైద్యాధికారి జరిగిన పరిణామాలపై విచారణ జరిపి శాస్త్ర చికిత్స నిపుణుడు, స్కానింగ్ నిర్వహించిన వైద్యుడు, గర్భిణీ స్కానింగ్ కోసం అబార్షన్ కోసం తరలించిన ఆర్ఎంపి వైద్యుడిని బాధ్యులుగా చేస్తూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసిన మహబూబాబాద్ టౌన్ పోలీసులు వారిని పట్టుకుని క్రమంలో ఇద్దరు వైద్యులు ఆంటీస్పేటరీ బెయిల్ తెచ్చుకొని అరెస్టు కాకుండా తప్పించుకున్నారు. మరోవైపు ఆర్ఎంపి వైద్యుడు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Also Read: GHMC Council Meeting: సజావుగా సాగిన.. జీహెచ్ఎంసీ కౌన్సిల్!