GHMC Street Lights ( IMAGE credit: twitter)
హైదరాబాద్

GHMC Street Lights: స్ట్రీట్ లైట్లకు మెరుగైన నిర్వహణ…ఆరు జోన్లకు 12 వేల వీధి లైట్లు!

GHMC Street Lights: గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) నిర్వహణ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఆ సంస్థ ఒప్పంద గడువు ముగియగానే బాధ్యతల నుంచి జీహెచ్‌ఎంసీ(GHMC) తప్పించింది. ఢిల్లీ, ఔటర్ రింగ్ రోడ్డు స్ట్రీట్ లైట్ నిర్వహణ తరహాలో మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు జీహెచ్‌ఎంసీ స్ట్రీట్ లైట్ల నిర్వహణలో అనుభవమున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) బిడ్లను ఆహ్వానించింది.

 Also Read: BJP Telangana: పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

ఆరు ప్రముఖ సంస్థలు బిడ్లను సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల జాబితాను ప్రభుత్వానికి పంపి, టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్వహణ సంస్థను ఖరారు చేసే లోపు స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతను మరింత మెరుగ్గా చేపట్టేందుకు ఐదుగురు అధికారులతో కూడిన ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్‌ల ముగ్గురు జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్ (మెయింటెనెన్స్), సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యులుగా ఉన్నారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

నిధుల కేటాయింపు..
ఈఓఐ బిడ్లను సమర్పించిన ఏజెన్సీల వివరాలను ప్రభుత్వానికి పంపి, అక్కడి నుంచి ఆమోదం వచ్చే వరకు స్ట్రీట్ లైట్ల(Street Lights)నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు వీలుగా, ఒక్కో జోనల్ కమిషనర్‌కు జోనల్ స్థాయిలో స్ట్రీట్ లైట్లు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు రూ. 3 కోట్లను కేటాయించారు. ఈ నిధులు సరిపోకపోతే సకాలంలో ప్రతిపాదనలు పంపితే అదనంగా కూడా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉన్నతాధికారులు జోనల్ కమిషనర్లకు స్పష్టం చేశారు. ఇప్పటికే స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించిన ఈఈఎస్ఎల్ ఒప్పందం ప్రకారం జీహెచ్‌ఎంసీకి రావాల్సిన సుమారు 12 వేల స్ట్రీట్ లైట్లను రప్పించారు. వీటిలో అంధకారం ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదులొచ్చిన ఖైరతాబాద్, చార్మినార్ జోన్‌లకు ఒక్కో జోన్‌కు 3 వేల లైట్లు చొప్పున పంపిణీ చేయగా, మిగిలిన 6 వేల లైట్లను ఇతర నాలుగు జోన్‌లకు ఒక్కో జోన్‌కు 1500 చొప్పున పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

నూతన వ్యూహం..
నగరంలోని మొత్తం 5 లక్షల పైచిలుకు స్ట్రీట్ లైట్ల(Street Lights నిర్వహణను ఈసారి పక్కాగా, పకడ్బందీగా చేపట్టాలని జీహెచ్‌ఎంసీ వ్యూహం సిద్ధం చేసింది. గతంలో ఈఈఎస్ఎల్ నిర్వహణ లోపాలతో నేర్చుకున్న గుణపాఠం ఆధారంగా, తిరిగి ఇలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్వహణ బాధ్యతలు చేపట్టే సంస్థ ఎప్పటికీ 10 శాతం లైట్లు, ఇతర సామగ్రిని బఫర్ కోటాగా అందుబాటులో ఉంచాలన్న నిబంధన ఉంది. కానీ ఈఈఎస్ఎల్ ఈ నిబంధనను ఉల్లంఘించి కనీసం అయిదు శాతం బఫర్ కోటాను కూడా మెయింటైన్ చేయలేకపోయిందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ అనుమతితో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఎంపిక చేయనున్న నిర్వహణ సంస్థ వెలిగే లైటుకు మాత్రమే కరెంటు చెల్లించే విధంగా నెట్‌వర్క్ కలిగి ఉండాలన్న నిబంధనను కూడా జీహెచ్‌ఎంసీ(GHMC) విధించింది. ఈ నిబంధనకు అనుగుణంగా ఫిలిప్స్, కాంప్ట్రాన్ వంటి ప్రముఖ సంస్థలు సమర్పించిన ఈఓఐ బిడ్లను ప్రభుత్వానికి పంపి, ప్రభుత్వం ఎంపిక చేసే మెరుగైన నిర్వహణ విధానాన్ని స్ట్రీట్ లైట్(Street Lights) నిర్వహణకు వర్తింపజేయాలని జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు భావిస్తున్నారు.

Also Read: GHMC: జీహెచ్ఎంసీ సరికొత్త ప్రయోగం.. విదేశీ తరహాలో ప్లాన్!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్