GHMC( IMAGE credit: twitter)
హైదరాబాద్

GHMC: అక్రమాల కట్టడికి జీహెచ్ఎంసీ కసరత్తు.. బ్రోకర్లను అనుమతించొద్దని కమిషనర్ ఆదేశం

GHMC: రాష్ట్రంలోని అతి పెద్ద స్థానిక సంస్థ జీహెచ్ఎంసీ(GHMC)లోని ప్లానింగ్ విభాగాంలో లోపాలను సరిదిద్దటంపై జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఫోకస్ చేశారు. ముఖ్యంగా నగరంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణలో భాగంగా రోజురోజుకి వేల సంఖ్యలో నిర్మాణాలు వస్తున్నాయి. కానీ వస్తున్న నిర్మాణాల్లో నూటికి తొంభై శాతం నిర్మాణాలు తీసుకున్న అనుమతిని ఉల్లంఘించి జరుగుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయంలో ఎక్కడ లోపం జరుగుతుందన్న విషయాన్ని లోతుగా పరిశీలించగా, నిర్మాణ అనుమతుల కోసం ఫైళ్లను అప్ లోడ్ చేస్త్తున్న కొందరు ప్లానర్స్, లైసెన్స్ డ్ ఆర్కిటెక్చర్లే మూలకారణంగా గుర్తించి, వారి పని తీరులో మార్పు తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ(GHMC) దృష్టి సారించింది.

జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని 30 సర్కిళ్లలో లైసెన్స్ డ్ ఆర్కిటెక్చర్లు సుమారు రెండున్నర వేల నుంచి మూడు వేల వరకు ఉన్నట్లు సమాచారం. వీరంతా జీహెచ్ఎంసీ (GHMC)పరిధిలోని వ్యక్తిగత నివాసాలు, అపార్ట్ మెంట్లు వంటి రెసిడెన్షియల్ భవనాలతో పాటు షాపింగ్ మాల్స్ వంటి కమర్షియల్ భవనాల నిర్మాణం కోసం తమ లాగిన్ నుంచి అనుమతులకు అవసరమైన డాక్యుమెంట్ల తో ఫైళ్లను అప్ లోడ్ చేస్తుంటారు. వీరి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ప్లానింగ్ అధికారులు అనుమతులు జారీ చేస్తుంటారు.

 Also Read: CM Revanth Reddy: పాలమూరు జిల్లాలో విద్య వైద్యం సాగు నీటి ప్రాజెక్టులు పూర్తికి ప్రాధాన్యం.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ సక్రమంగానే ఉన్నా..

ఫైల్ అప్ లోడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సక్రమంగానే ఉన్నా, ఆర్కిటెక్చర్లు ప్లానింగ్ సిబ్బందితో కుమ్మక్కై యజమాని నుంచి భారీగా డబ్బులు గుంజేందుకు ఉద్దేశపూర్వకంగా షార్ట్ ఫాల్స్ పెట్టి యజమానులను ఆందోళనకు గురి చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. నిర్మాణ అనుమతులు ఇప్పించేందుకు యజమాని నుంచి ఛార్జీలు వసూలు చేసుకునే ఆర్కిటెక్చర్లు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకునేందుకు ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బందితో కలిసి కొర్రీలను పెడుతూ యజమానులు బెంబేలెత్తేలా చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులున్నాయి.

మరి కొందరు ఆర్కిటెక్చర్లు నిర్మాణ అనుమతుల జారీ కోసం లైజనింగ్ చేసేందుకు ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ఈ ఏజెంట్లు జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయం, జోన్, సర్కిల్ ఆఫీసుల్లో ఉదయం నుంచే తిష్ట వేసి అధికారుల వద్ద పైరవీలు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ రకమైన వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు కమిషనర్ ప్లానింగ్ విభాగానికి ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నిర్మాణ అనుమతులకు సంబంధించి ఆర్కిటెక్చర్ లాగిన్ నుంచి ఫైలు అప్ లోడ్ చేసినప్పటికీ, అధికారుల సందేహాలను తీర్చేందుకు ఏజెంట్లు, ఆర్కిటెక్చర్లు కాకుండా నేరుగా యజమానినే అనుమతించాలని కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం.

నిర్మాణ అనుమతులను ఉల్లంఘించేలా…

ప్లాటు, స్థల యజమానులకు నిర్మాణ అనుమతులు ఇప్పించేందుకు లైసెన్స్ డ్ ఆర్కిటెక్చర్లు, ప్లానర్లు కేవలం టెక్నికల్ సలహాదారులు మాత్రమేనన్న విషయాన్ని గుర్తించాలని ప్లానింగ్ అధికారులు సూచిస్తున్నారు. ప్లాటు సైజును బట్టి కమర్షియల్, రెసిడెన్షియల్ నిర్మాణ అనుమతుల కోసం తమ లాగిన్ నుంచి దరఖాస్తులను అప్ లోడ్ చేస్తున్న ఆర్కిటెక్చర్లే నిర్మాణ అనుమతుల ఉల్లంఘనకు కారకులవుతున్నారన్న విషయాన్ని కూడా అధికారులు గుర్తించారు. నిర్మాణ అనుమతులు ఇప్పించే బాధ్యత తీసుకున్న ఆర్కిటెక్చర్లు, ప్లానర్లు తీసుకున్న అనుమతి ప్రకారం ఎలాంటి డీవియేషన్స్ లేకుండా నిర్మాణాలు జరిగేలా యజమానులకు సహకరించాల్సి ఉంటుంది.

కానీ కొందరు ఆర్కిటెక్చర్లు బిల్డర్, యజమానులచే ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేయిస్తున్నట్లు, చివరకు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ భవనానికి అక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే అర్హత కొల్పోయేలా నిర్మాణాలుంటున్నాయి. ఎలాగో ప్లానింగ్ ఆఫీసర్లను మేనేజ్ చేసి, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇప్పిస్తామని మరి కొందరు ఆర్కిటెక్చర్లు యజమానుల నుంచి లక్షల్లో వసూలు చేసుకుంటున్నట్లు కూడా గుర్తించారు. కానీ తీసుకున్న నిర్మాణ అనుమతిని పది శాతం కన్నా ఎక్కువ ఉల్లంఘించి నిర్మిస్తే ఆ భవనానికి అక్యుపెన్సీ సర్టిఫికెట్ రాదన్న విషయాన్ని యజమానులు, బిల్డర్లకు ఆర్కిటెక్చర్లు వివరిస్తే ఈ రోజు వేల సంఖ్యలో అక్యుపెన్సీ సర్టిఫికెట్ దరఖాస్తులు పరిష్కారం కాకుండా ఉండేవి కాదని కొందరు ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు.

సందర్శకుల అనుమతికి త్వరలో ప్రత్యేక విధానం

ప్రస్తుతం జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ను సందర్శకులు కలిసేందుకు అనుసరిస్తున్న ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఓటీపీ విధానాన్ని జీహెచ్ఎంసీ(GHMC) అన్ని కార్యాలయాల ప్లానింగ్ ఆఫీసుల్లో అమలు చేసే యోచనలో కమిషనర్ ఉన్నట్లు సమాచారాం. ప్లానింగ్ ఆఫీసుల్లో ఒక్కో అధికారి ఛాంబర్ వద్ద ప్లాటు, స్థల యజమానుల కంటే ఏజెంట్లు, ఆర్కిటెక్చర్లే ఎక్కువగా గుమిగూడుతున్నట్లు గుర్తించారు. నిర్మాణ అనుమతి కోసం అధికారులను సంప్రదించేందుకు వచ్చే సందర్శకులు, ప్లాటు యజమానులను ప్రతి రోజు మధ్యాహ్నాం మూడు గంటల నుంచి అయిదు గంటల వరకు పరిమిత సంఖ్యలో సందర్శకులను ఆధార్ కార్డు, ఫోన్ ఓటీపీ సహాయంతో అనుమతించేలా సరి కొత్త విధానాన్ని అమల్లోకి తేవాలని కమిషనర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

 Also Read: Minister Seethakka: కవిత ఎపిసోడ్ పెద్ద డ్రామా?.. మంత్రి సీతక్క ఫైర్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం