GHMC Serilingampalle( image credit: plxabay OR FREE PIC)
హైదరాబాద్

GHMC Serilingampalle: జీహెచ్ఎంసీలో టెక్నికల్ దుర్వినియోగం? అర్ధరాత్రి ఐడి లాగిన్!

GHMC Serilingampalle: అర్థరాత్రి శేరిలింగంపల్లి (Serilingampalle) జోనల్ కమిషనర్ ఐడి లాగిన్ చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్ ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోనల్ టౌన్ ప్లానింగ్ (Town planning) విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న అభిలాష్ గత వారం రోజుల క్రితం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ సహాదేవరావుకు సంబంధించిన ఐడి ద్వారా అర్థరాత్రి లాగిన్ చేసేందుకు ప్రయత్నించగా, జోనల్ కమిషనర్ ఫోన్ కు ఓటీపీ (OTP) వచ్చింది. కాగా ఇదే విషయమై జెడ్సీ మరుసటి రోజు కార్యాలయంలో ఆరా తీయడంతో పాటు, జీహెచ్ఎంసీ (GHMC) ఐటీ వింగ్ లో లాగిన్ కు ప్రయత్నించిన వారి వివరాల కోసం ఫిర్యాదు చేశారు.

Also ReadKCR: యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్.. మరోసారి వైద్య పరీక్షలు

అక్కడే విధులు నిర్వహించే అభిలాష్ తానే లాగిన్ కు ప్రయత్నించినట్లు జెడ్సీ కి తెలిపినట్లు సమాచారం. వేరే జోన్ లో విధులు నిర్వహిస్తున్న సిటీ ప్లానర్ లాగిన్ కి బదులుగా జోనల్ కమిషనర్ లాగిన్ లోకి తప్పుగా వెళ్ళినట్లు వివరించగా, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్సీ సదరు ఆపరేటర్ ను వీధుల నుంచి తొలగించినట్లు విశ్వసనీయ సమాచారం. తాను ఇక్కడ ఉన్నంత కాలం జోనల్ పరిధిలో కనిపించవందంటూ వార్నింగ్ ఇచ్చినట్లు కార్యాలయ ఉద్యోగులు (Employees) గుసగుసలాడుతున్నారు.

అర్థరాత్రి లాగిన్ చేయాల్సిన అవసరమేంటి?
అధికారులు కార్యాలయ పని వేళల్లోనే సరిగా పనులు చేయరంటూ ప్రజలలో అపనమ్మకం మూటకట్టుకున్న తరుణంలో అర్దరాత్రి అధికారులు లాగిన్ చేయాల్సిన అవసరమేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జోనల్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఒక్కో ఫైల్ పూర్తవ్వడానికి నెలలు పడుతుండగా, రాత్రి వేళల్లో పనిచేసి ఆదర్శంగా నిలవాలనుకున్న అధికారి ఎవరంటూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెడుతున్నారు. అధికారులు కావాలనుకుంటే సమయం, సందర్భం ఏది ఉండదని, అదే ప్రజలు అడిగితే సవాలక్ష్య కొర్రీలు అడ్డుపడతాయాంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులకు తెలియకుండా లాగిన్ సాధ్యమా?
జీహెచ్ఎంసీ (GHMC) టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులకు సమాచారం లేకుండా ఆపరేటర్ లాగిన్ (Login) అయ్యే అవకాశం ఉండదు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, సిటీ ప్లానర్ లు లాగిన్ అవ్వాలంటే వారి అఫీషియల్ మొబైల్ కు వచ్చే ఓటిపి లేకుండా లాగిన్ అవ్వలేరు. అలాంటిది అర్ధరాత్రి ఆపరేటర్ లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించడం వెనకాల ఉన్నది ఎవరని అంతుచిక్కని ప్రశ్న. కేవలం ఆపరేటర్లు టౌన్ ప్లానింగ్ (Town planning) విభాగంలో అవకతవకలకు పాల్పడుతున్నారు అనడం అవివేకం అవుతుంది. ఈ వ్యవహారం వెనకాల ఉన్న అసలు వ్యక్తులు తెలియాలంటే పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్, మున్సిపల్ శాఖ మంత్రులు ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 Also Read: Congress Party: కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్ ఎమ్మెల్యేలు.. సవాల్‌గా మారిన ఇష్యూ

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?