KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో (Yashoda Hospital) చేరారు. వైద్యుల సూచన మేరకు అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు ఆయనకు పలు వైద్య పరీక్షలు చేశారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటరింగ్ చేసినట్లు సమాచారం. రెగ్యులర్ హెల్త్ చెకప్‌లో భాగంగానే వైద్య పరీక్షలు నిర్వహించామని డాక్టర్లు తెలిపారు. సాయంత్రం డిశ్చార్జ్ అయిన కేసీఆర్, అక్కడి నుంచి నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు.
Also Read: Crime News: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తల్లి ప్రియుడితో కలిసి ఘాతుకం
ఈ నెల 3న జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి నంది నగర్ ఇంటికి వెళ్లారు. తర్వా యశోద ఆసుపత్రిలో చేరారు. పలు పరీక్షలు చేసిన వైద్యులు వారం రోజులు అబ్జర్వేషన్‌లో ఉండాలని చెప్పి, రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఉంచి పంపించారు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత పరీక్షలు చేస్తామని చెప్పారు. అప్పటి నుంచి నంది నగర్ ఇంటిలోనే ఉంటున్న కేసీఆర్ గురువారం ఆసుపత్రికి వెళ్లి మళ్లీ పరీక్షలు చేయించుకున్నారు.
Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్